Sarfaraz Khan BCCI : సర్ఫరాజ్ ఖాన్ ప్రవర్తన సరిగా లేదు
బీసీసీఐ సంచలన కామెంట్స్
Sarfaraz Khan BCCI : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంచలన వ్యాఖ్యలు చేసింది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఎంపిక చేసిన భారత క్రికెట్ జట్టులో యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ను ఎంపిక చేయక పోవడంపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది. తాజా, మాజీ క్రికెటర్లు , అభిమానులు బీసీసీఐ ఎంపిక తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశీ వాలి క్రికెట్ లో అద్భుతంగా రాణించినా ఎందుకని ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా నిప్పులు చెరిగారు. దీంతో బీసీసీఐ అధికారికంగా వివరణ ఇచ్చింది.
సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) ఆట తీరు బాగానే ఉందని, అతడిని కావాలని తాము పక్కన పెట్టడం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో అతడు ఫిట్ గా ఉన్నానని నిరూపించు కోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. అయితే మరో కీలక వ్యాఖ్యలు చేసింది సర్ఫరాజ్ ఖాన్ పై. మైదానంలో, వెలుపల అతడి ప్రవర్తన బాగా లేదని సంచలన ఆరోపణలు చేసింది బీసీసీఐ.
ప్రధానంగా అతడు చేసిన హావ భావాలు సరిగా లేవని స్పష్టం చేసింది. అతడు క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆటతో పాటు పనితీరు ముఖ్యమని పేర్కొంది బీసీసీఐ. ప్రస్తుతం బీసీసీఐ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తీవ్ర విమర్శలు గుప్పించాడు బీసీసీఐపై. ఎందుకని నలుగురు ఓపెనర్లను ఎంపిక చేసిందో చెప్పాల్సిన అవసరం ఉందన్నాడు. ఇది హాట్ టాపిక్ గా మారింది.
Also Read : The Emergecny Comment : ఎమర్జెన్సీ కాలం మానని గాయం
