BCCI Shock : సీనియర్లకు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ..?
వచ్చే ఏడాది తొలగించే అవకాశం
BCCI Shock : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ చేతిలో చేతులెత్తేసింది భారత జట్టు. అటు బ్యాటింగ్ లో కోహ్లీ, పాండ్యా తప్పితే మిగతా ఆటగాళ్లు ఆశించిన రీతిలో ఆడిన పాపాన పోలేదు. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు వచ్చే ఏడాది 2023లో సీనియర్లకు షాక్(BCCI Shock) ఇవ్వనుంది. ఎవరినీ రిటైర్మెంట్ అడగక పోవచ్చు. మూడు ఫార్మాట్ లకు సంబంధించి టి20, వన్డే, టెస్టులకు సంబంధించి ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
విచిత్రం ఏమిటంటే ఎలాంటి ప్రతిభ కనబర్చని రిషబ్ పంత్ ను కావాలని ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియా వేదికపై అద్భుతమైన ట్రాక్ రికార్డును కలిగి ఉన్న కేరళ స్టార్ హిట్టర్ సంజూ శాంసన్ ను ఎంపిక చేయలేదని మాజీ ఆటగాళ్లు ప్రశ్నించారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ , తదితర సీనియర్ ఆటగాళ్లను టి20 ఫార్మాట్ లో ఎంపిక చేయక పోవచ్చని సమాచారం. భారత టి20 జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోవడం ఖాయమని బీసీసీఐ(BCCI Shock) వర్గాల ద్వారా లీక్ కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కోహ్లీ పుల్ ఫామ్ లో ఉన్నాడు.
ఇక బీసీసీఐ చీఫ్ గా కొత్తగా రోజర్ బిన్నీ ఎన్నికయ్యాక ఏమైనా మార్పులు ఉంటాయా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా సీనియర్లకు చెక్ పెడతారా లేదా అన్నది వేచి చూడాలి. ఫుల్ ఫామ్ లో ఉన్న కోహ్లీని కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి.
Also Read : భారత్ పరాజయం రోహిత్ భావోద్వేగం