Sanju Samson : ఎట్టకేలకు సంజూ శాంసన్ కు చాన్స్
ఐర్లాండ్ తో ఆడే టి20 జట్టుకు ఎంపిక
Sanju Samson : కేరళ స్టార్ హిట్టర్ సంజూ శాంసన్(Sanju Samson) పై ఎట్టకేలకు బీసీసీఐ కరుణించింది. గత కొంత కాలంగా ఈ అద్భుతమైన ఆటగాడిని పక్కన పెట్టింది. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది బీసీసీఐ.
ప్రత్యేకించి భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మపై నిప్పులు చెరిగారు మాజీ ఆటగాళ్లు. రాజస్తాన్ రాయల్స్ మేనేజ్ మెంట్ అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచేలా చేశాడు.
ఐపీఎల్ చరిత్రలో 14 ఏళ్ల తర్వాత రాజస్తాన్ రాయల్స్ జట్టును భారత దేశంలో జరిగిన రిచ్ లీగ్ ఐపీఎల్ 2022లో ఫైనల్ కు చేర్చాడు. టోర్నీలో 485 పరుగులు చేశాడు. సెంచరీలు చేయక పోయినా కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.
అంతే కాదు కెప్టెన్ గా 100 మార్కులు కొట్టేశాడు. ఇదే సమయంలో రాజస్తాన్ రాయల్స్ జట్టు కోచ్ గా ఉన్న శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర కీలక వ్యాఖ్యలు చేశాడు.
సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడని అతడు కచ్చితంగా ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కు ఎంపికవుతాడని ధీమా వ్యక్తం చేశాడు.
ఇదే సమయంలో భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవి శాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు శాంసన్ గురించి. ఆస్ట్రేలియాలో అద్భుతంగా ఆడే దమ్ము శాంసన్(Sanju Samson) కు మాత్రమే ఉందన్నాడు.
ఎందుకంటే బంతులు వేగంగా, బ్యాటర్ల పైకి వస్తుంటాయి. వాటిని ఎదుర్కొనే నైపుణ్యం సంజూకే ఉందన్నాడు. ఈ తరుణంలో ఐర్లాండ్ లో ఈనెల 26, 28 న ఐర్లాండ్ తో జరిగే టీ20 మ్యాచ్ లకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సంజూ శాంసన్ ను ఎంపిక చేసింది.
Also Read : టెస్టు ర్యాంకింగ్స్ లో జో రూట్..కమిన్స్ టాప్