Bharathidasan : ప్రియ‌మైన త‌మిళం ఉనికికి మూలం 

చ‌ర్చ‌కు దారి తీసిన భార‌తీదాస‌న్ క‌వి 

Bharathidasan : దేశంలోని ప్ర‌జ‌లంతా ఇంగ్లీష్ కాకుండా హిందీలోనే మాట్లాడాల‌ని కామెంట్ చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై క‌ల‌క‌లం రేగుతోంది. దీనిపై త‌మిళ‌నాడు అంత‌టా తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ సినీ సంగీత ద‌ర్శ‌కుడు అల్లా ర‌ఖా ర‌హ‌మాన్ పోస్ట్ చేశారు. ఆయ‌న చేసిన పోస్ట్ ఇప్పుడు దేశమంత‌టా, ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది.

అందులో  రహమాన్ ప్ర‌ముఖ త‌మిళ క‌వి భార‌తీ దాస‌న్ (Bharathidasan)రాసిన ఓ క‌విత లోని వ్యాక్యాల‌ను ఉద‌హ‌రించారు.

ప్ర‌స్తుతం  ఎవ‌రా క‌వి. ఏమిటి ఆయ‌న ప్ర‌త్యేక‌త అని వెతుకుతున్నారు.

పుదుచ్చేరిలో 1891 ఏప్రిల్ 29న పుట్టారు భార‌తీ దాస‌న్. 1964 ఏప్రిల్ 21న మ‌ర‌ణించారు. ఆయ‌న వృత్తి రీత్యా టీచ‌ర్. త‌మిళంలో పేరు మోసిన క‌విగా గుర్తింపు పొందారు.

త‌మిళ కార్య‌క‌ర్త కూడా. స్వ‌చ్ఛ‌మైన త‌మిళ ఉద్య‌మానికి ఆయ‌న మ‌ద్ద‌తు ప‌లికారు.

ఆయ‌న అస‌లు పేరు క‌న‌గ‌స‌బాయి సుబ్బు . ఆ త‌ర్వాత భార‌తీదాస‌న్(Bharathidasan) గా పిలుచుకుంటారు త‌మిళులు.

20వ శ‌తాబ్ద‌పు త‌మిళ క‌వి, ర‌చ‌యిత‌. హేతువాది. ఆయ‌న సాహిత్య ర‌చ‌న‌లు ఎక్కువ‌గా సామాజిక , రాజ‌కీయ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌తిబింబించాయి.

భార‌తీదాస‌న్ పై పెరియార్ , త‌మిళ క‌వి సుబ్ర‌మ‌ణ్య భార‌తిల ప్ర‌భావం అత్య‌ధికంగా  ఉండింది.

త‌న‌ను తాను భార‌తీదాసన్ అని పేరు పెట్టుకున్నాడు. ఆయ‌న రాసిన ర‌చ‌న‌లు ద్రావిడ ఉద్య‌మం పెరుగుద‌ల‌కు ప్రేర‌ణ‌గా   నిలిచాయి.

భార‌తీ దాస‌న్ క‌విత్వంతో పాటు , అభిప్రాయాలు, నాట‌కాలు, సినిమా స్క్రిప్టులు, చిన్న క‌థ‌లు, వ్యాసాలు ఇత‌ర రూపాల‌లో వ్య‌క్తీక‌రించ‌బ‌డ్డాయి కూడా.

అంతే కాదు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అయిన‌ప్ప‌టికీ ఆ రాష్ట్ర పాట‌గా భార‌తీదాసన్ రాసిన మ‌ద‌ర్ త‌మిళ్ కు ఆహ్వానం పాట‌ను స్వీక‌రించింది.

పెరియార్ చేత భార‌తీ దాస‌న్ కు విప్ల‌వ క‌వి అని బిరుదును ప్ర‌దానం చేశారు. 1946లో శాంతి, మూగ‌త‌నం నాట‌కానికి గోల్డెన్ పారోట్ బ‌హుమ‌తి పొందాడు.

ఆయ‌న మ‌ర‌ణాంత‌రం 1970లో పిసిరంత‌య్య‌ర్ నాట‌కానికి సాహిత్య అకాడ‌మీ అవార్డు ద‌క్కింది. 2001 అక్టోబ‌ర్ 9న చెన్నైలో పోస్ట‌ల్ డిపార్ట్ మెంట్ భార‌తీదాస‌న్ పేరుతో స్మార‌క స్టాంపును విడుద‌ల చేసింది.

త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఏటా ఒక త‌మిళ క‌వికి భార‌తీదాస‌న్ అవార్డును బ‌హూక‌రిస్తుంది. తిరుచిరాప‌ల్లిలో భార‌తీదాస‌న్ విశ్వ విద్యాయం పేరుతో రాష్ట్ర యూనివ‌ర్శిటీ ఏర్పాటు చేశారు.

దేశంలోనే అగ్ర‌గామిగా ఉన్న మేనేజ్ మెంట్ స్కూల్స్ లో భార‌తీదాస‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఒక‌టి. మొత్తంగా భార‌తీ దాస‌న్ క‌వి మాత్ర‌మే కాదు త‌మిళుల ఆరాధ్య దైవం. ఈ విప్ల‌వ‌క‌వి చెప్పిన‌ట్టు ప్రియ‌మైన త‌మిళం మ‌న ఉనికికి మూలం క‌దూ.

Also Read : ఎంద‌రో ఆశావ‌హులు కొంద‌రే మంత్రులు

Leave A Reply

Your Email Id will not be published!