Ben Stokes : ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ గా బెన్ స్టోక్స్
ప్రకటించిన ఇంగ్లండ్ , వేల్స్ క్రికెట్ బోర్డు
Ben Stokes : ఇంగ్లండ్ ఆల్ రౌండర్ స్టార్ ప్లేయర్ గా పేరొందిన బెన్ స్టోక్స్ కు ఊహించని ఛాన్స్ దక్కింది. ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ గా బెన్ స్టోక్స్(Ben Stokes )ను నియమించింది ఆ దేశ క్రికెట్ బోర్డు.
గురువారం అధికారికంగా బెన్ స్టోక్స్ ను స్కిప్పర్ గా నియమించినట్లు ఇంగ్లాండ్ , వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. దీనిని ధ్రువీకరించింది కూడా.
అన్ని ఫార్మాట్ లలో ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన బెన్ స్టోక్స్(Ben Stokes )ను నియమిస్తున్నట్లు తెలిపింది బోర్డు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా చేతిలో 0-4 తేడాతో పరాజయం పొందడం, వెస్టిండీస్ తో 0-1 తేడాతో ఓటమి పాలు కావడంతో ఇప్పటి వరకు ఇంగ్లండ్ పురుషుల జట్టు కెప్టెన్ గా ఉన్న జో రూట్ తన పదవికి స్వచ్చందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రపంచంలోనే టాప్ ప్లేయర్లలో జో రూట్ ఒకడు. అతడి సక్సెస్ రేటు కూడా బాగానే ఉంది. కానీ పరాజయానికి తానే బాధ్యుడినంటూ తప్పుకుంటన్నట్లు వెల్లడించాడు.
అందరినీ విస్తు పోయేలా చేశాడు. దీంతో జో రూట్ స్థానం ఖాళీ కావడంతో ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఇవాళ అత్యవసర సమావేశం అయింది.
ఈ మేరకు బెన్ స్టోక్స్ వైపు మొగ్గు చూపినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇంగ్లండ్ టీం టెస్టు చాంపియన్ షిప్ లో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. కాగా బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ జట్టుకు 81వ కెప్టెన్ కావడం విశేషం.
Also Read : రఫ్పాడించిన రాహుల్ తెవాటియా