Ben Stokes : పాకిస్తాన్ కు బెన్ ‘స్ట్రోక్’ బిగ్ షాక్
ఆశలపై నీళ్లు చల్లిన క్రికెటర్
Ben Stokes : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ -2022ను ఇంగ్లండ్ ఎగరేసుకు పోయింది. ఎక్కడా ఆ జట్టు ఫైనల్ లో తగ్గలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఛాంపియన్ లాగా ఆడింది.
ఇది పక్కన పెడితే కప్ ఎగరేసుకు పోతామని, తమకు ఎదురే లేదని, ఏ జట్టు వచ్చినా తమదే విజయం అంటూ బీరాలు పలికిన పాకిస్తాన్ టీమ్ కు చుక్కలు చూపించాడు ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్(Ben Stokes). ఒక రకంగా చెప్పాలంటే స్ట్రోక్ ఇచ్చాడు తన విధ్వంసకరమైన, బాధ్యాయుతమైన ఆట తీరుతో.
ఆటలో గెలుపు ఓటములు సహజం. కానీ ఆటగాళ్లకు ఉండాల్సింది ప్రధానంగా ప్రొఫెజనలిజం. మెగా టోర్నీలో ఇంగ్లండ్ పూర్తిగా గెలుస్తూ రాలేదు. కానీ ఓడినా పాఠాలు నేర్చుకుంది. సెమీస్ లో భారత జట్టును చెప్పి మరీ ఛేదించింది. ఒకటా రెండా ఏకంగా 10 వికెట్ల తేడాతో చుక్కలు చూపించింది.
ఇక పాకిస్తాన్ ప్రగల్బాలకు చెక్ పెట్టింది. ఇందులో ప్రధానంగా కీలక పాత్ర పోషించిన వారిలో కరన్ తో పాటు బెన్ స్టోక్. టి20 వరల్డ్ కప్ ను చేజిక్కించు కోవడం ఇంగ్లండ్ కు ఇది రెండవ సారి. ఆ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని చేకూర్చి పెట్టాడు బెన్ స్టోక్(Ben Stokes). ఈ సందర్భంగా కీలకమైన కామెంట్స్ చేశాడు.
మమ్మల్ని నెదర్లాండ్స్ ఓడించింది. మేం ఎక్కడ తప్పులు చేశామో తెలుసుకునేందుకు ఛాన్స్ ఏర్పడిందన్నాడు. ఫైనల్ మ్యాచ్ లో వరుసగా దాడి చేయడం మొదలు పెట్టాడు. బెన్ స్టోక్స్ వన్డేకు గుడ్ బై చెప్పాడు.
కేవలం టెస్టులు, పొట్టి ఫార్మాట్ లకే పరిమితం అయ్యాడు. మొత్తంగా బెన్ స్టోక్ పాకిస్తాన్ పాలిట శాపంగా మారాడు. వారి ఆశలను వమ్ము చేస్తూ ఇంగ్లండ్ కు అద్భుత విజయాన్ని చేకూర్చి పెట్టాడు.
ఇంగ్లండ్ కు ఐసీసీ ట్రోఫీని అందించిన బెన్ స్టోక్స్ పై ఆస్ట్రేలియా జట్టు ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే త్వరలో ఆసిస్ గడ్డపై యాషెస్ సీరీస్ ఆడనుంది. ఏది ఏమైనా ఇంగ్లండ్ ఆటగాళ్లను భారత జట్టు చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
Also Read : షోయబ్ అక్తర్ కు షమీ స్ట్రాంగ్ కౌంటర్