Ben Stokes : బెన్ స్టోక్స్ సంచలన కామెంట్స్
ఈసీబీ నిర్వాకమే ప్రధాన కారణం
Ben Stokes : ప్రపంచంలోనే టాప్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నారు ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) . అనూహ్యంగా ఆయన వన్డే మ్యాచ్ ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఆడే సత్తా కలిగి ఉన్నప్పటికీ తాను ఆడలేక పోతున్నట్లు తెలిపాడు. ప్రధానంగా తాను త్వరగా పదవీ విరమణ చేసేందుకు కారణం ఇంగ్లండ్ సౌత్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కారణమని సంచలన ఆరోపణలు చేశాడు.
ఇకనైనా షెడ్యూల్ ను వెంట వెంటనే కాకుండా కొంచెం మ్యాచ్ ల మధ్య గ్యాప్ ఉండేలా చూడాలని సూచించాడు. దీంతో ఉన్నట్టుండి ఫామ్ లో ఉన్న బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈసీబీపై.
ప్రధానంగా స్టోక్స్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇదే సమయంలో తాజా, మాజీ ఆటగాళ్లు సైతం ఈసీబీ పై నిప్పులు చెరుగుతున్నారు. మాజీ క్రికెటర్లు నాసిర్ హుస్సేన్ , కెవిన్ పీటర్సన్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆడే సత్తా ఉన్నా బిజీ షెడ్యూల్ కారణంగా ఎవరూ సరైన రీతిలో ఆటపై ఫోకస్ పెట్టడం లేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా బెన్ స్టోక్స్ తప్పు కోవాలని నిర్ణయం తీసుకోవడం వెనుక ఈసీబీ ఉందని ఆరోపించారు.
2019 వన్డే వరల్డ్ కప్ ఇంగ్లండ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు బెన్ స్టోక్స్(Ben Stokes) . పరిగెత్తేందుకు తాము కార్లను కామని పేర్కొన్నాడు. తన నిర్ణయంతోనైనా ఈసీబీ మేల్కోవాలని సూచించాడు బెన్ స్టోక్స్.
Also Read : ఇంగ్లండ్ బోర్డు నిర్వాకం పీటర్సన్ ఆగ్రహం