Bengal CM-RG Kar Case : ఆర్జికర్ కేసుపై స్పందించిన బెంగాల్ సీఎం మమతా బనర్జీ
అయితే తాము నష్టపరిహారం ఆశించడం లేదని...
RG Kar : ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలి హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కు సిల్దా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ ఇచ్చిన తీర్పుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee) స్పందించారు. ”నేను సంతృప్తి చెందలేదు” అని అన్నారు. ఆర్జీకర్ కేసులో సీల్దా కోర్టు సోమవారంనాడు కీలక తీర్పు చెబుతూ, సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధిస్తున్నట్టు ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తాము నష్టపరిహారం ఆశించడం లేదని, న్యాయం జరగాలని కోరుకుంటున్నామని బాధితురాలి తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు.
RG Kar Campus Case…
ఆర్జీకర్ కేసును బలవంతంగా కోల్‌కతా పోలీసుల నుంచి లాక్కున్నారని, అదే కేసు తమవద్దే ఉంటే మరణశిక్ష పడేలా చూసేవాళ్లమని ముర్షీబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ అన్నారు. ”దోషికి మరణశిక్ష విధించాలని అందరూ డిమాండ్ చేశాం. అయితే చనిపోయేంత వరకూ జైలులోనే ఉంచాలని కోర్టు తీర్పునిచ్చింది. కోల్‌కతా పోలీసుల వద్దే కేసు ఉండి ఉండే మరణశిక్షకు పడేది” అని చెప్పారు.దర్యాప్తు ఏవిధంగా జరిగిందో తమకు తెలియదని, ఇలాంటి చాలా కేసులే రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేశారని, మరణశిక్షలు పడ్డాయని అన్నారు. ప్రస్తుత తీర్పుపై తాను సంతృప్తిగా లేనని చెప్పారు.
Also Read : Kaleswaram-KCR : మాజీ సీఎం కేసీఆర్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన కాళేశ్వరం మేనేజ్మెంట్