Bhagavanth Kesari Teaser : భ‌గ‌వంత్ కేస‌రి టీజ‌ర్ అదుర్స్

బాల‌య్య బ‌ర్త్ డే గిఫ్ట్ అదిరింది

Bhagavanth Kesari Teaser : మినిమం గ్యారెంటీ ఉన్న ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో న‌ట సింహం నందమూరి బాల‌కృష్ణ న‌టించిన భ‌గ‌వంత్ కేస‌రి(Bhagavanth Kesari) చిత్రానికి సంబంధించి శ‌నివారం అంగ‌రంగ వైభ‌వంగా రిలీజ్ అయింది. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన‌ట్లుగా మొత్తం 108 థియేట‌ర్ల‌లో టీజ‌ర్ ను ప్ర‌ద‌ర్శించారు. ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసే నటుడిగా గుర్తింపు పొందారు బాల‌కృష్ణ‌. ఆయ‌న అటు వెండి తెర‌పై ఇటు బుల్లి తెర‌పై దుమ్ము రేపుతున్నాడు.

ఇక డైలాగ్ డెలివ‌రీని వాడ‌డంలో బాల‌య్య‌కు సాటి రారెవ్వ‌రు. ఇవాళ ప్ర‌త్యేకించి జూన్ 10న నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు. అందుకే మూవీ మేక‌ర్స్ ఆయ‌న‌కు అంద‌మైన గిఫ్ట్ ను టీజ‌ర్ రూపంలో అందించారు. ఎప్ప‌టి లాగే న‌వ్వులు పండించే అనిల్ రావిపూడి అందుకు భిన్నంగా మాస్ యాక్ష‌న్ సినిమాను తీసుకు వ‌స్తున్నాడు. అందులో న‌ట సింహానికి ఎవ‌రు పేరు పెడ‌తారు. జీవించేశాడు బాల‌య్య బాబు.

ఆయ‌న‌కు తోడుగా కాజ‌ల్ అగ‌ర్వాల్, ముద్దుగుమ్మ శ్రీ‌లీల జంట‌గా న‌టించ‌నున్నారు. భ‌గ‌వంత్ అంటే విష్ణువు కేస‌రి అంటే సింహం అని అర్థం. అందుకే బాల‌కృష్ణ మేన‌రిజానికి స‌రిపోయేలా ఈ పేరు పెట్ట‌డం జ‌రిగింద‌ని తెలిపారు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఈ టీజ‌ర్ ను హైద‌రాబాద్ లోని శ్రీ భ్ర‌మ‌రాంబ థియేట‌ర్ లో లాంచ్ చేశారు.

Also Read : Venkaiah Naidu Tour : నెల్లూరు జిల్లాలో వెంక‌య్య ప‌ర్య‌ట‌న

 

Leave A Reply

Your Email Id will not be published!