Khatkar Kalan Bhagat Singh : ఇది ఒక చరిత్రకు దర్పణం. భారత దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరదాత్తుడు సర్దార్ షహీద్ భగత్ సింగ్.
ఇవాళ మరోసారి ఆ వీరుడి గురించి తెలుసుకునేలా, స్మరించు కునేలా చేసిన ఘనత మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ కే దక్కుతుంది.
యావత్ పంజాబ్ రాష్ట్రమంతా ఆప్ సాధించిన విజయంలో ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో మాన్ కీలక ప్రకటన చేశాడు.
ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ కార్యాలయాలలో సీఎం ఫోటో ఉండదన్నాడు.
అంతే కాదు విప్లవ యోధుడు భగత్ సింగ్ , భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఫోటో ఉంటుందని ప్రకటించాడు.
అంతే కాదు పంజాబ్ రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయానికి తెర తీశాడు భగవంత్ మాన్.
తాను ధురి నియోజకవర్గం నుంచి ఎన్నికైన వెంటనే గత కొంత కాలంగా సంప్రదాయ బద్దంగా వస్తున్న రాజ్ భవన్ సంస్కృతికి పుల్ స్టాప్ పెట్టాడు.
తాను కామన్ మ్యాన్ నని సీఎంగా తనతో పాటు కోట్లాది మంది ఆరాధించే ఆ పోరాట యోధుడు
భగత్ సింగ్(Khatkar Kalan Bhagat Singh) పుట్టిన ఖట్కర్ కలాన్ లో ప్రమాణ స్వీకారం చేస్తానని వెల్లడించాడు.
దీంతో దేశం యావత్తు మాన్ చేసిన ప్రకటనతో ఆశ్చర్యానికి లోనైంది.
ఆ ఖట్కర్ కలాన్ గ్రామమే షహీద్ భగత్ సింగ్ పుట్టిన ఊరు. ఇప్పుడు ఆ ఊరికి ఎనలేని ప్రాధాన్యత లభించింది.
ఇక నుంచి ప్రధాన మంత్రి మోదీ ఫోటోలు ఉండవన్నారు. దివంగత స్వాతంత్ర సమర యోధుడు బాబా సాహిబ్ అంబేద్కర్ సిద్దాంతాలకు తాను ప్రభావితం చెందానని చెప్పారు.
అంతే కాదు తన ఆరాధ్య దైవం భగత్ సింగ్ అని పేర్కొన్నారు భగవంత్ మాన్.
ఒకప్పుడు నటుడు, ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యేగా ఇప్పుడు సీఎంగా ఉన్న మాన్ తాను భగత్ సింగ్ అనుచరుడినంటూ చెబుతారు.
తన ర్యాలీలు, బహిరంగ ప్రసంగాల సమయంలో ఆయన పదే పదే ఉటంకిస్తూ వస్తారు.
ఆయన గత నెలలో జరిగిన ఎన్నికల్లో షహీద్ భగత్ సింగ్ చేసిన త్యాగాన్ని గుర్తుంచు కోవాలని పదే పదే ఓటర్లకు విన్నవించారు.
2014లో భగత్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ కూడా చేశారు మాన్. భగత్ సింగ్ నినదించిన ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నది ఆప్ ప్రధాన నినాదంగా మారింది.
Also Read : పని చేయని పంజాబ్ ఫార్ములా
Jai Bharath, Jai Bhagat singh