Bhagwant Mann : పేద‌ల‌కు ఉచితంగా న్యాయం అందించండి

పంజాబ్ హ‌ర్యానా బార్ అసోసియేష‌న్ లో సీఎం మాన్

Bhagwant Mann : పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ న్యాయం అన్న‌ది పేద‌ల‌కు అంద‌కుండా పోతోంద‌న్నారు. ఇది చాలా ఖ‌ర్చుతో కూడుకుని ఉండ‌డం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మంగ‌ళ‌వారం పంజాబ్ – హ‌ర్యానా బార్ అసోసియేష‌న్ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి సీఎం భ‌గ‌వంత్ మాన్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు సీఎం.

బార్ అసోసియేష‌న్ కోసం రూ. 2.5 కోట్లు గ్రాంట్ ప్ర‌క‌టించారు. వీటిని మూడు రోజుల్లో విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు భ‌గ‌వంత్ మాన్. ఈ సంద‌ర్భంగా లాయ‌ర్లు, న్యాయ‌వాదుల‌కు, బార్ అసోసియేష‌న్ బాధ్యుల‌కు కీల‌క సూచ‌న చేశారు.

న్యాయం కోసం వ‌చ్చే పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, బాధితులు, బ‌హుజ‌నుల‌కు అండ‌గా నిల‌వాల‌ని సూచించారు. వారి త‌ర‌పున ఎలాంటి ఫీజులు వ‌సూలు చేయ‌కుండా ఉచితంగా వాదించాల‌ని, వారికి న్యాయం అందేలా చూడాల‌ని పిలుపునిచ్చారు.

ఎవ‌రూ కావాల‌ని కోర్టుకు రావాల‌ని అనుకోర‌న్నారు. కొన్ని అనుకోని ప‌రిస్థితులు, సంఘ‌ట‌న‌ల వ‌ల్ల కోర్టుల ప్రాంగ‌ణాలు ఎక్కుతార‌ని చెప్పారు భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann).

జీవితంలో ఎంతో ఉన్న‌త స్థానంలో ఉన్న వారు త‌మ విలువైన జీవితంలో విలువైన స‌మ‌యాన్ని పేద‌ల కోసం కేటాయించాల‌ని సీఎం కోరారు. ఇదే స‌మ‌యంలో సామాజిక అభివృద్దిలో కీల‌క భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు.

ఏ స‌మ‌స్య ఉన్నా త‌న‌తో చెపితే దానిని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని చెప్పారు భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann). మౌలిక వ‌స‌తులు, స‌దుపాయాలు క‌ల్పించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు సీఎం.

Also Read : శివ‌లింగం సుర‌క్షితం న‌మాజ్ ఆపొద్దు

Leave A Reply

Your Email Id will not be published!