Bhagwant Mann : చుక్క‌లు చూపిస్తున్న భ‌గ‌వంత్ మాన్

మాజీ ఎమ్మెల్యేల‌కు కోలుకోలేని షాక్

Bhagwant Mann : భార‌త స్వాతంత్ర సంగ్రామంలో ఆంగ్లేయుల గుండెల్లో నిద్ర పోయిన విప్ల‌వ వీరుడు స‌ర్దార్ ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ (Sardar Shahid Bhagat Singh) అంటే చ‌చ్చేంత ఇష్టం పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann) కు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా ఆప్ 92 సీట్లు గెలుపొందింది. ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది.

సీఎంగా కొలువు త‌రిన వెంట‌నే భ‌గ‌వంత్ మాన్ సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు తెర లేపారు. త‌న ఫోటో కానీ మోదీ ఫోటో కానీ ఉండాల్సిన అవ‌స‌రం లేద‌న్నాడు.

త‌మ‌కు బ‌దులు భ‌గ‌త్ సింగ్ , అంబేద్క‌ర్ ఫోటోలు మాత్ర‌మే ఉండాల‌ని ఆదేశించాడు.

అంతేనా ఎవ‌రైనా లంచం అడిగితే వెంట‌నే త‌న‌కు ఫోన్ చేయాల‌ని వీడియో లేదా మెస్సేజ్ చేయాల‌ని ఏకంగా మొబైల్ నెంబ‌ర్ ఇచ్చాడు.

రాష్ట్రంలో వెట్టి చాకిరి చేస్తున్న 35 వేల మందిని ప‌ర్మినెంట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

ప్ర‌స్తుతానికి ఖాళీగా ఉన్న 25 వేల పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

ఎమ్మెల్యేలు వారి నియోజ‌క‌వ‌ర్గాల‌లోనే ఉండాల‌ని స్ప‌ష్టం చేశాడు. తాజాగా మాజీ ఎమ్మెల్యేల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు.

ఒక్కొక్క‌రు రెండు మూడు పెన్ష‌న్లు పొందుతుండ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఎవ‌రైనా స‌రే అంద‌రికీ ఒకే పెన్ష‌న్ సౌక‌ర్యం వ‌ర్తింప (Bhagwant Mann)చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు భ‌గ‌వంత్ మాన్.

ఒక టెర్మ్ కు గాను ఒక్కో ఎమ్మెల్యే రూ. 75 వేల పెన్ష‌న్ పొందుతారు. త‌ద‌ప‌రి కాలానికి పెన్ష‌న్ మొత్తంలో 66 శాతం ఇస్తూ వ‌స్తున్నారు.

దీని వ‌ల్ల పంజాబ్ రాష్ట్ర ఖజానాపై భారీ భారం ప‌డుతోంద‌ని చెప్పాడు సీఎం.

ఒక ఎమ్మెల్యే ఒక్క సారి గెలిచినా లేదా ఎన్ని సార్లు గెలిచినా ఒకే ఒక్క పెన్ష‌న్ మాత్ర‌మే పొందుతాడ‌ని ప్ర‌క‌టించాడు.

మిగిలిన డ‌బ్బుల‌ను ప్ర‌జా సంక్షేమానికి వినియోగిస్తామ‌ని వెల్ల‌డించాడు.

ఒక్కొక్క‌రు ఏకంగా రూ. 3.50 ల‌క్ష‌ల నుంచి రూ. 5.25 ల‌క్ష‌ల దాకా పొందుతున్నార‌ని తెలిపారు.

ఈ మేర‌కు అధికారుల‌కు ఆదేశాలు కూడా జారీ చేశాన‌ని ప్ర‌క‌టించారు.

ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ త‌న‌కు పెన్ష‌న్ వ‌ద్ద‌న్నాడు. త‌న పెన్ష‌న్ కొంత మంది నిరుపేద బాలిక‌ల‌కు, వారి విద్య కోసం ఖ‌ర్చు చేయాల‌ని సూచించాడు

మ‌రో మాజీ ఎమ్మెల్యే. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ పాల్ సింగ్ ఖైరా స్వాగ‌తించారు.

Also Read : ఐపీఎల్ ‘జ‌ట్లు..ఆట‌గాళ్లు’ వీరే

Leave A Reply

Your Email Id will not be published!