Harbhajan Singh : ఈనెల 31న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)తమ అభ్యర్థులుగా ఐదుగురిని ఎంపిక చేసింది. వారిలో ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh)అలియాస్ భజ్జీతో పాటు రాఘవ్ ఛద్దా, అశోక్ మిట్టల్ (Ashok Mittal) , సందీప్ పాఠక్ , సంజీవ్ అరోరాను నామినేట్ చేసింది.
ఈ ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో ఆప్ కు రాజ్యసభలో తమ ఎమ్మెల్యేల సంఖ్యా బలం కారణంగా మూడు సీట్లు ఉండేవి.
కానీ అనూహ్యంగా తాజాగా పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకు గాను 92 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
దీంతో సంఖ్యా పరంగా చూస్తే రాజ్యసభలో ఆ పార్టీకి అదనంగా 5 సీట్లు రానున్నాయి. ఇక పంజాబ్ కు చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులు సుఖ్ దేవ్ సింగ్ ధిమ్సా, ప్రతాప్ సింగ్ బల్వా , శ్వేత్ మాలిక్ , నరేష్ గుజ్రాల్ , షంషేర్ సింగ్ దుల్లో పదవీ కాలం వచ్చే ఏప్రిల్ 9తో ముగియనుంది.
దీంతో ఆప్ ఎంపిక చేసిన ఐదుగురు అభ్యర్థులు ఎంపిక కావడం అన్నది నల్లేరు మీద నడకేనని చెప్పక తప్పదు. ఇక ఎన్నికల కంటే ముందు భారత మాజీ క్రికెటర్ , పీసీసీ మాజీ చీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూతో హర్బజన్ సింగ్(Harbhajan Singh) కలిశాడు.
అప్పట్లో ఆయన కాంగ్రెస్ లో చేరతారు అనుకున్నారు. కానీ తనకు సిద్దూ సోదరుడు అవుతాడని పేర్కొన్నాడు భజ్జీ. ఇదిలా ఉండగా ఎన్నికలు ముగిసిన వెంటనే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హర్బజన్ సింగ్ కు ఛాన్స్ ఉంటుందన్నాడు. ఎందుకంటే వీరిద్దరూ మంచి స్నేహితులు. ఆయన సీఎంగా కొలువు తీరిన వెంటనే భజ్జీకి అనుకున్నట్లుగానే అవకాశం లభించడం విశేషం.
Also Read : అతడితో ఆడేందుకు వేచి చూస్తున్నా