Bhajrang Punia & Sakshi Malik : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ భళా
బజరంగ్ పునియా..సాక్షి మాలిక్..దీపక్ పునియా
Bhajrang Punia & Sakshi Malik : బ్రిటన్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత దేశానికి చెందిన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. అద్భుత ప్రదర్శనతో పతకాల పంట పండించారు.
జాతీయ పతాకం గర్వ పడేలా చేశారు. కుస్తీ పోటీల్లో మరోసారి మనోళ్లు మెరిసారు. బజరంగ్ పునియా(Bhajrang Punia) ఎప్పటి లాగే బంగారు పతకాన్ని దక్కించు కోగా సాక్షి మాలిక్(Sakshi Malik) , దీపక్ పునియా మొదటిసారి కామన్వెల్త్ గేమ్స్ లో పసిడి పతకాలను సాధించి తమకు ఎదురే లేదని చాటారు.
పురుషుల 65 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ ఫైనల్ లో కెనడాకు చెందిన లాచ్ లాన్ మెక్ నీల్ ను ఓడించి గోల్డ్ మెడల్ ను సాధించాడు.
2016లో రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్ మహిళల 62 కేజీల విభాగంలో కెనడాకు చెందిన అనా గొంజా లెజ్ ను వెనక్కి నెట్టి భారత్ కు స్వర్ణ పతకాన్ని అందించింది.
ఇక పురుషుల 86 కేజీల విభాగంలో పాకిస్తాన్ కు చెందిన మహ్మద్ ఇనామ్ ను ఓడించి దీపక్ పునియా బంగారు పతకాన్ని సాధించాడు. వరుసగా ఒకే రోజు భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు దక్కాయి.
టోక్యోలో 2020లో జరిగిన పోటోల్లో బంజరంగ్ కాంస్య పతకాన్ని గెలుపొందాడు. 2014లో గ్లాస్గోలో జరిగిన పోటీల్లో రజతం సాధించాడు.
అదే ఏడాది ఇంచియాన్ లో జరిగిన ఆసియా క్రీడల్లో మరో రజతం పొందాడు. జకార్తాలో జరిగిన ఆసియాడ్ లో బంగారు పతకాన్న సాధించాడు. ఇదిలా ఉండగా సాక్షి మాలిక్ కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం.
Also Read : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు 26 పతకాలు