Bhim Army Chief Attack : భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ పై కాల్పులు
సహరాన్ పూర్ లో దాడి..ఆస్పత్రికి తరలింపు
Bhim Army Chief Attack : భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్(Chandrashekhar Azad Ravan) పై కాల్పులకు గురయ్యారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై కాల్పులకు తెగబడ్డారు. రెండు బుల్లెట్లు దూసుకు పోయాయి. తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ ఆజాద్ ను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయట పడినట్లు సమాచారం.
భీమ్ ఆర్మీ చీఫ్ కారుపై రెండు బుల్లెట్లు దూసుకు పోయాయి. మొదటి బుల్లెట్ వాహనం లోని సీటులోకి దూసుకు పోయింది. రెండో బుల్లెట్ ఆజాద్ నడుమును తాకింది. దీని నుంచి తృటిలో తప్పించుకున్నారు ఆజాద్. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై కొంత మంది వ్యక్తులు కాల్పలకు తెగబడ్డారని పోలీసులు తెలిపారు. వైద్య చికిత్స కోసం సీహెచ్ సీకి తరలించారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి విపిన్ తాడా తెలిపారు.
భీమ్ ఆర్మీ చీఫ్ టయోటా ఫార్చూనర్ కారులో ప్రయాణం చేస్తుండగా ఈ దాడికి గురయ్యారు. కాగా ఆజాద్ ప్రయాణిస్తున్న కారు, ఆయన దెబ్బతిన్న ఫోటోలను భీమ్ ఆర్మీ సోషల్ మీడియా విడుదల చేసింది. ఇదిలా ఉండగా భీమ్ ఆర్మీ చీఫ్ పై జరిగిన దాడిని పలువురు ఖండించారు. సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో పాటు ఇతర నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.
Also Read : PDA Alliance Comment : కలిసిన ‘కత్తులు’ కలవని పొత్తులు