Bhumana Slams Bandi Sanjay : కేంద్రమంత్రి బండి సంజయ్ పై భగ్గుమన్న మాజీ టీటీడీ చైర్మన్

ఈ వ్యాఖ్యలు అర్థం లేని, ఆధారాలు లేని ఆరోపణలుగా పేర్కొన్నారు...

Bhumana : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో వెయ్యి మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు అర్థం లేని, ఆధారాలు లేని ఆరోపణలుగా పేర్కొన్నారు.

Bhumana – “శ్రీవారి ఆలయంపై దాడి లాంటి వ్యాఖ్యలు”

టీటీడీలో వెయ్యిమంది అన్యమత ఉద్యోగులున్నారని బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలు, ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నంగా భావిస్తున్నట్టు భూమన (Bhumana) మండిపడ్డారు. “దర్శనం చేసుకుని వెళ్లిపోయే వారే తిరిగి వచ్చి ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు,” అని ఆయన వ్యాఖ్యానించారు. టీటీడీ పాలనపై బండ్ల వేశాలే తప్ప, ఇది సాధారణ వ్యాఖ్య కాదని తెలిపారు.

22 మంది మాత్రమే అన్యమత ఉద్యోగులుగా గుర్తింపు

అయితే టీటీడీ బోర్డు ఆరు నెలల క్రితం విడుదల చేసిన సమాచారం ప్రకారం, కేవలం 22 మంది మాత్రమే అన్యమత ఉద్యోగులుగా గుర్తించబడ్డారని గుర్తు చేశారు. అలాంటి సమయంలో బండి సంజయ్ “వెయ్యిమంది” అని పేర్కొనడం అనుమానాస్పదమని అన్నారు. “వాస్తవాధారాలు ఉంటే బండి సంజయ్ బహిరంగంగా వెల్లడించాలి,” అంటూ భూమన సవాల్ విసిరారు.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం

బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. “24 గంటలు గడిచినా టీటీడీ చైర్మన్, ఈఓ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎవరు స్పందించలేదు. వీరంతా బండి సంజయ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారా?” అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

“పాలకమండలి, ఉద్యోగుల పరువు దెబ్బతీసేలా వ్యాఖ్యలు”

టీటీడీ పాలక మండలి, ఉద్యోగుల పరువు దిగజారేలా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ భక్తులు, ఉద్యోగుల మనోభావాలను గౌరవిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తన మాటలపై పునర్విచారణ చేయాలని సూచించారు.

ఈ అంశంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని, టీటీడీ వంటి విశ్వసనీయ సంస్థపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం తగదని భూమన కరుణాకర్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు.

Also Read : Minister Anam : తిరుమల ఆలయ అభివృద్ధిపై మంత్రి కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!