Bhushan Kumar : ముంబై – భారత దేశంలో టాప్ లో కొనసాగుతోంది వినోద రంగంలో టీ సీరీస్ కంపెనీ. ఆడియో పరంగానే కాదు సినిమాలు, వెబ్ సీరీస్ లను నిర్మించడంలో ముందంజలో కొనసాగుతోంది. తాజాగా టాలీవుడ్ కు చెందిన డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డితో కలిసి యానిమల్ సినిమా తీశాడు. భారీ ఖర్చుతో తీసిన ఈ చిత్రం ఆరంభం నుంచే అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకు వెళ్లింది. ఎవరూ ఊహించని రీతిలో కోట్లు కొల్లగొట్టింది. దీంతో ఒక్కసారిగా వంగా సందీప్ రెడ్డి దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచాడు.
Bhushan Kumar Appreciates
తను తొలుత విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి పేరుతో సినిమా తీశాడు. దీనిని హిందీలో షాహిద్ కపూర్ తో తెరకెక్కించాడు. అది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా రణ్ బీర్ కపూర్, అందాల తార రష్మిక మందన్నాతో యానిమల్ పేరుతో చిత్రాన్ని తీశాడు.
సూపర్ టాక్ తో దూసుకు పోతుండడంతో నిర్మాతల్లో ఒకరైన టీ సీరీస్ చీఫ్ భూషణ్ కుమార్(Bhushan Kumar) సంతోషాన్ని వ్యక్తం చేశారు. తను వంగా సందీప్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోలను తాజాగా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు , ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
మా ఇద్దరి మధ్య ఎంతో కాలంగా అనుబంధం ఉంది. వంగాతో సాన్నిహిత్యం బాగుంటుందని, అది మరింత ఆహ్లాదకరంగా, ఆలోచనాత్మకంగా ఉంటుందని పేర్కొన్నాడు భూషణ్ కుమార్.
Also Read : Uttam Kumar Reddy : కేసీఆర్ నిర్వాకం ఉత్తమ్ ఆగ్రహం