Ketanji Brown jackson : సుప్రీంకోర్టు జడ్జిగా కేతంజీ బ్రౌన్ జాక్సన్
అమెరికా చరిత్రలో మొదటి నల్ల జాతియురాలు
Ketanji Brown jackson : అమెరికా దేశ చరిత్రలో ఊహించని నిర్ణయం తీసుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్. ఆ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మొదటి నల్ల జాతీయురాలైన మహిళను ప్రకటించారు.
కేతంజీ బ్రౌన్ జాక్సన్ బాధ్యతలు స్వీకరిస్తే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లవుతుంది. బ్రౌన్ జాక్సన్ (Ketanji Brown jackson)ను నియమిస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. సెనేట్ ధ్రువీకరించినట్లయితే కేతంజీ బ్రౌన్ జాక్సన్ కొత్త ఆశలకు ప్రతిరూపంగా నిలుస్తారని చెప్పక తప్పదు.
ఈ సందర్భంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి సంబంధించిన చట్ట పరమైన అత్యున్నతమైన వ్యక్తులలో కేతంజీ బ్రౌన్ జాక్సన్ ఒకరు అంటూ కితాబు ఇచ్చారు.
ఆమె అసాధారణమైన, అద్భుతమైన నాయకురాలే కాదు న్యాయమూర్తి కూడా అని పేర్కొన్నారు బైడెన్. యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ లో జాక్సన్ ఒకరు.
ఫెడరల్ జ్యుడీషియల్ నామినీలలో ఒకరు కూడా. అంతకు ముందు కేతంజీ బ్రౌన్ జాక్సన్ 2013 నుంచి వాషింగ్టన్ డీసీలో జిల్లా కోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2020 లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా బైడెన్ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
నల్ల జాతికి చెందిన మహిళకు న్యాయమూర్తిగా పని చేసే అవకాశం కల్పిస్తానని చెప్పాడు. దానిని ఇవాళ ఆచరణలో చేసి చూపించారు.
ఇది నేర న్యాయ వ్యవస్థలో పొందు పర్చిన జాతి పక్షపాతం, న్యాయ స్థానంలో వైవిధ్యం , ప్రాతినిధ్యం లేక పోవడం వల్ల చాలా నష్టం జరిగిందని పేర్కొన్నారు బైడన్.
Also Read : మహిమా దాట్లకు అరుదైన గౌరవం