Big Boss 6 Winner Revanth : బిగ్ బాస్ సీజ‌న్ – 6 విన్న‌ర్ రేవంత్

రూ. 40 ల‌క్ష‌ల‌తో నిష్క్ర‌మించిన శ్రీ‌హాన్

Big Boss 6 Winner Revanth : తెలుగు వారి లోగిళ్ల‌లో మోస్ట్ పాపుల‌ర్ రియాల్టీ షోగా పేరొందిన బిగ్ బాస్ – 6 ఎట్ట‌కేల‌కు ముగిసింది. విజేత‌గా రేవంత్ నిలిచాడు. ఇక శ్రీ‌హాన్ క్యాష్ తో వెళ్లి పోయాడు. అంతా ఊహించిన‌ట్టే జ‌రిగింది. చివ‌రి దాకా రేవంత్ గెలుస్తాడ‌ని అనుకున్నారు. అత‌డే అంతిమంగా నిలిచాడు. బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 6 విన్న‌ర్ గా నిలిచాడు.

సోష‌ల్ మీడియాలో సైతం రేవంత్ కే ఓటు(Big Boss 6 Winner Revanth) వేశారు. ఇక ఆద్యంత‌మూ ఈసారి సీజ‌న్ కూడా ఉత్కంఠ భ‌రితంగా, నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. పార్టిసిపెంట్స్ త‌మ త‌మ ప‌రిధుల్లో స‌త్తా చాటారు. కానీ అంతిమంగా రేవంత్ ను వ‌రించింది. త‌ను గెల‌వాల‌ని అనుకున్నాడు. అలాగే గురి పెట్టాడు.

బిగ్ బాస్ ఇచ్చిన అన్ని టాస్క్ ల‌ను దాటుకుంటూ వ‌చ్చాడు. చివ‌రి అడుగును చేరుకున్నాడు. విజేత‌గా నిలవాలంటే దూకుడు కంటే ఓపిక చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్ప‌క‌నే చెప్పాడు విన్న‌ర్ రేవంత్. అది లైఫ్ లోనైనా లేదా ఇంకే పోటీలోనైనా ఆచి తూచి అడుగులు వేస్తే అనుకున్న‌ది స్వంతం అవుతుంద‌ని నిరూపించాడు ఈ బిగ్ బాస్.

టాస్క్ ప‌రంగా అన్నింటిని ఎదుర్కొనేందుకు మాన‌సికంగా సిద్ద‌మ‌య్యాడు రేవంత్. అదే అత‌డిని ప్ర‌త్యేకంగా ఇంత దాకా తీసుకు వ‌చ్చేలా చేసింది. ఇదే స‌మ‌యంలో రేవంత్ కు బిడ్డ పుట్ట‌డం కూడా పోటీలో మ‌రింత క‌సిగా ఆడేలా చేసింది. దేనికైనా సానుకూల దృక్ఫ‌థం ఉంటే సునాయ‌సంగా క‌ష్టాల‌ను ఎదుర్కోవ‌చ్చ‌ని చేసి చూపించాడు రేవంత్.

ఇదిలా ఉండ‌గా బిగ్ బాస్ సీజ‌న్ 6 విష‌యానికి వ‌స్తే సెప్టెంబర్ 4 న‌న మొద‌లైంది. 21 మంది పోటీ ప‌డ్డారు. చివ‌ర‌కు ఆది రెడ్డి, శ్రీ‌హాన్ , రేవంత్ , కీర్తి భ‌ట్ నిలిచారు. టాప్ -2 లో చివ‌ర‌కు రేవంత్, శ్రీ‌హాన్ నిలిచారు. రూ. 40 ల‌క్షలు తీసుకుని శ్రీ‌హాన్ నిష్క్ర‌మించాడు.

Also Read : రాహుల్ యాత్ర‌లో పాల్గొన‌నున్న క‌మ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!