#Samantha : మరో ‘క్రేజీ ప్రాజెక్ట్’లో సమంత.. వైరల్ అవుతున్న లుక్!

Samantha  : టాలీవుడ్ యంగ్ బ్యూటీ సమంత అక్కినేని గురించి అందరికీ తెలిసిందే. తన అందంతో యువతను, అభిమానుల మనసును గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస ఆఫర్లతో.. బుల్లితెరపై కూడా బిజీగా ఉంది. కాగా ఇటీవలే నూతన సంవత్సర సందర్భంగా ఓ క్రేజీ ప్రాజెక్టును దక్కించుకుంది..

పెళ్లి తర్వాత తన అందంలో మరింత అందాన్ని పెంచుకుంటూ.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ‘శాకుంతలం’ అనే సినిమా టైటిల్ రోల్ చేస్తున్నట్లు సినీ నిర్మాత బృందం తెలిపింది. కాగా ఈ పోస్టర్ ను న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసింది. ఈ సినిమాలో నటించే నటుల గురించి పూర్తి వివరాలు రాకపోగా.. ఈ సినిమా నీలిమ గుణ నిర్మాతగా, మణిశర్మ సంగీతం తో వస్తుందని తెలిపారు.

కాగా ప్రస్తుతం సమంత బుల్లితెరపై ఆ హలో సామ్ జామ్ అంటూ షో కి హోస్టింగ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో స్టార్ హీరోలందరినీ వ్యక్తిగత విషయాలతో ప్రశ్నిస్తూ.. కాస్త ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది ఈ బ్యూటీ. అంతేకాకుండా సోషల్ మీడియాలో తను మోడలింగ్ దుస్తులను ధరించి గ్లామర్ లుక్స్ లను అందిస్తూ ఫోటోలను తెగ షేర్ చేస్తుంది. ఇటీవలే న్యూఇయర్ సందర్భంగా తన స్నేహితులతో పాటు గోవా కి వెళ్ళిన ఫోటోను షేర్ చేయగా అది వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ‘ కాతువాకుల రేండు కాదల్’ సినిమాలో హీరో విజయ్ సేతుపతి తో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది సమంత.

No comment allowed please