Aaditya Thackeray Koshyari : మరాఠా ప్రజల విజయం – ఆదిత్యా
గవర్నర్ మార్పుపై మాజీ మంత్రి కామెంట్
Aaditya Thackeray Koshyari : శివసేన బాల్ ఠాక్రే పార్టీ అగ్ర నాయకుడు, మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. మరాఠా ప్రజలను కించపరిచేలా , మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీని చులకనగా చేస్తూ మాట్లాడిన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కేంద్ర ప్రభుత్వం తప్పించింది. ఈ మేరకు ఆయన స్థానంలో గతంలో జార్ఖండ్ గవర్నర్ గా పని చేసిన రమేష్ బయాస్ ను నూతన గవర్నర్ గా సిఫారసు చేసింది. ఈ మేరకు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించింది.
కోష్యారీని తప్పించడంపై సీరియస్ గా స్పందించారు ఆదిత్యా ఠాక్రే. కోష్యారీ(Aaditya Thackeray Koshyari) చేసిన రాజీనామాను కూడా ఆమోదించడం, కొత్త గవర్నర్ ను అపాయింట్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని ,ఇది పూర్తిగా మరాఠా ప్రజలు సాధించిన విజయంగా అభివర్ణించారు ఆదిత్యా ఠాక్రే. ఆదివారం ఆదిత్యా ఠాక్రే మీడియాతో మాట్లాడారు. కోష్యారీని మార్చడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది శివసేన పార్టీతో పాటు మరాఠా యోధులు సాధించిన అపూర్వమైన గెలుపుగా పేర్కొన్నారు.
నిత్యం విద్వేషాలను రెచ్చగొడుతూ గవర్నర్ పదవిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన కోష్యారీకి తగిన శాస్తి జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు మహారాష్ట్ర వ్యతిరేక గవర్నర్ తప్పుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ , మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి బాయి పూలే, భారత రాజ్యాంగం , ప్రజాస్వామ్య ఆదర్శాలను నిరంతరం అవమానించిన ఇక ఎంత మాత్రం అంగీకరించ లేమని పేర్కొన్నారు ఆదిత్యా ఠాక్రే.
Also Read : అస్సాం గవర్నర్ గా కటారియా