Bihar BJP Chief : బీహార్ సీఎం మౌనం బీజేపీ ఆగ్ర‌హం

అగ్నిప‌థ్ అల్ల‌ర్లు, ఆఫీసుల‌పై దాడులు

Bihar BJP Chief : కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన అగ్నిప‌థ్ స్కీంపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధానంగా మొద‌ట బీహార్ లో ఆందోళ‌న మిన్నంటింది. రైళ్లు త‌గుల బెట్టారు. బ‌స్సుల అద్దాలు ధ్వంసం చేశారు.

ఆపై బీజేపీ ఎమ్మెల్యేపై దాడికి దిగారు. అనంత‌రం బీజేపీ ఆఫీస్ ను చింద‌ర వంద‌ర చేశారు. అనంత‌రం డిప్యూటీ సీఎం ఇంటిపైకి వెళ్లారు. నానా హంగామా సృష్టించారు.

రోజు రోజుకు నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు పెరుగుతున్నాయి త‌ప్ప త‌గ్గ‌డం లేదు. పోలీసులు చేతులెత్తేశారు. ప్ర‌భుత్వం చూస్తూ ఉండి పోయింద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

ప్ర‌భుత్వంలో మిత్ర‌ప‌క్షంగా ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏకంగా అధికార‌ప‌క్షంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సీఎం నితీష్ కుమార్ అనుస‌రిస్తున్న మెత‌క వైఖ‌రి కార‌ణంగానే ప‌రిస్థితి ఇంత దాకా వ‌చ్చింద‌ని మండి ప‌డుతోంది.

ఇది పూర్తిగా ఉద్దేశ పూర్వ‌కంగానే జ‌రిగింద‌ని, దీని వెనుక కొన్ని శ‌క్తులు ఉన్నాయంటూ ఆరోపించింది. ఈ త‌రుణంలో ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఓ వైపు బీహార్ త‌గుల‌బ‌డి పోతుంటే బీహార్ సీఎం , బీజేపీ మైలేజీ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నాయంటూ ఆరోపించారు. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

తాజాగా బీజేపీ తీవ్ర స్థాయిలో మండిప‌డింది. జాతీయ చీఫ్(Bihar BJP Chief) రాజీవ్ రంజ‌న్ ఆలియాస్ లాల‌న్ సింగ్ , మ‌రో సీనియ‌ర్ నేత ఉపేంద్ర కుష్వాహా ట్వీట్ల‌తో హోరెత్తించారు.

రాష్ట్రంలోని 12 బీజేపీ ఆఫీసుల‌పై దాడులు జ‌రిగాయ‌ని వాపోయింది. సీఎంపై నిప్పులు చెరిగారు బీహార్ బీజేపీ అధ్య‌క్షుడు సంజ‌య్ జైస్వాల్ . ప‌రిపాల‌న క‌ళ్లు మూసుకు పోయింద‌ని మండిప‌డ్డారు.

Also Read : ఈడీ ముందుకు రాహుల్ గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!