Bihar Crisis : ముదిరిన వివాదం కూలనుందా ప్రభుత్వం
నితీష్ కుమార్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ
Bihar Crisis : బీహార్ లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాయి.
తాజాగా నితీష్ కుమార్ , మోదీ మధ్య దూరం పెరిగింది. దీంతో మరాఠాలో చోటు చేసుకున్న సీన్ ఇక్కడ కూడా రిపీట్ కానుందా అన్న అనుమానం కలుగుతోంది.
ఒక రకంగా చెప్పాలంటే ప్రమాదంలో ప్రభుత్వం ఉన్నట్టే కనిపిస్తోంది. మంగళవారం ఎంపీలు, ఎమ్మెల్యేలతో కీలక భేటీకి పిలుపునిచ్చారు నితీశ్ కుమార్.
ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం తాడో పేడో తేల్చుకునేందుకు సీఎం రెడీగా ఉన్నారంటున్నారు. ఈ తరుణంలో బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించ బోతోందనే దానిపై నిర్ణయం ఆధారపడి ఉంటుంది.
జేడీయూ నుండి వైదొలిగిన ఆర్సీపీ సింగ్ ఈ సంక్షోభంలో కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా నితీష్ , బీజేపీ మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నా తాజాగా అవి మరింత వేడి పుట్టిస్తున్నాయి.
2017లో ఒకరిపై మరొకరు అనుకున్నా సద్దు మణిగింది. కానీ ఇప్పుడు తాడో పేడో తేల్చుకునేందుకు డిసైడ్ అయినట్లు సమాచారం.
మోదీ విందుకు ఆహ్వానించినా హాజరు కాలేదు తాజాగా ఢిల్లీల ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్(Neeti Ayog) కీలక మీటింగ్
కు డుమ్మా కొట్టారు నితీష్ కుమార్. జేడీయూను బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రకు పాల్పడుతోందంటూ ఆరోపించారు ఆ పార్టీ చీఫ్.
2020లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నితీష్ కుమార్ ఓట్లు చీలి పోయేలా బీజేపీ చిరాగ్ మోడల్ ను అమలు చేసిందని ఆరోపించారు ఆ పార్టీ చీఫ్.
దీని వల్ల రాష్ట్రంలో 243 సీట్లలో కేవలం 43 సీట్లు మాత్రమే గెలుచుకుందని లాలన్ సింగ్ ఆరోపించారు. బీజేపీ ప్రతినిధులు కొందరు
సీనియర్ మంత్రి నితీష్ కుమార్ తో సమావేశం కావడాన్ని సీరియస్ అయ్యారు.
నితీష్ కుమార్ ను గద్దె దింపితే ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ లేదా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం బీహా(Bihar Crisis) ర్ లో ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాగా బీహార్ లో అమిత్ షా రిమోట్ కంట్రోల్ చేస్తున్నారంటూ నితీష్ కుమార్ ఆరోపిస్తున్నారు. మొత్తంగా సర్కార్ కూలి పోతుందా లేక నిలుస్తుందా అన్నది తేలాల్సి ఉంది.
Also Read : ‘వెంకయ్య’పై ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఫైర్