Bihar Protest : ‘అగ్నిపథ్ స్కీం’పై యువత ఆగ్రహం
కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
Bihar Protest : దేశంలో భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ రాబోయే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన కొత్త స్కీం కూడా డిక్లేర్ చేశారు.
అదేమిటంటే అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీం. ఈ పథకం ఉద్దేశం సాయుధ దళాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన యువతను భర్తీ చేసుకోవాలని. దీనిపై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది.
రాహుల్ గాంధీ తప్పు పట్టారు. మరో వైపు యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆందోళన బాట పట్టింది. తమ ఆశలను చంపే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు.
బుధవారం బీహార్(Bihar Protest) లోని ముజఫర్ పూర్ , బక్సర్ లలో యువకులు భారీగా నిరసన చేపట్టారు. నాలుగు సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
సరే ఆ కాంట్రాక్టు ముగిశాక తాము ఎక్కడికి వెళ్లాలని యువత ప్రశ్నిస్తోంది. కేంద్రంపై నిప్పులు చెరుగుతోంది. ఇది పూర్తిగా మోస పూరితమైన ప్రకటన అంటూ ఆరోపించారు నిరుద్యోగులు. ఆర్మీలో చేరాలని కోరిక ఉంది.
గతంలో ఎన్నడూ లేని రీతిలో కాంట్రాక్టు కింద ఎంపిక చేయాలని అనుకోవడం, దీనికి అందమైన పేరు స్కీం పెట్టడం దారుణంగా ఉందన్నారు.
కేవలం ఇంత కష్టపడింది కేవలం కాంట్రాక్టు ఉద్యోగం కోసమేనా అని మండి పడుతున్నారు. సాయుధ దళాల్లో వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించు కునేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పూరితంగా ఈ అగ్నిపథ్ స్కీంను తీసుకు వచ్చిందంటూ ఆరోపించారు.
Also Read : రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ