Bill Gates Modi : మన్ కీ బాత్ కి బిల్ గేట్స్ ఫిదా
ప్రధాన మంత్రి మోదీకి కంగ్రాట్స్
Bill Gates Modi : ప్రపంచంలో ఏ దేశ ప్రధాని చేయని విధంగా మోదీ మన్ కీ బాత్ పేరుతో రేడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ఆయన పీఎంగా కొలువు తీరాక రేడియో మాధ్యమాన్ని , అవసరాన్ని గుర్తించారు. ఆ మేరకు దేశానికి చెందిన విశేషాలు, వింతలు, ఆవిష్కరణలు, ఆలోచనలు, కష్టపడి పైకి వచ్చిన వాళ్లు, విజేతలు, ప్రయాణ అనుభవాలు, ఇలా ప్రతి ఒక్క అంశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వచ్చారు ప్రధానమంత్రి(Bill Gates Modi).
ఇదిలా ఉండగా మన్ కీ బాత్ ను అక్టోబర్ 3, 2014న ప్రారంభించారు. ఇప్పటికీ ఏప్రిల్ 30తో మన్ కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్ పూర్తవుతుంది. ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా పేరు పొందిన వ్యక్తులు, సంస్థలను ప్రత్యేకంగా ఆహ్వానించారు ప్రధానమంత్రి. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తోంది కేంద్ర సర్కార్.
ఈ మొత్తం ఎపిసోడ్ పై ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అధిపతి బిల్ గేట్స్ స్పందించారు. ప్రధానమంత్రి మోదీ(PM Modi) చేపట్టినందుకు ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసల జల్లులు కురిపించారు. ట్విట్టర్ వేదికగా మోదీకి కంగ్రాట్స్ తెలిపారు. ప్రతి నెలా చివరి ఆదివారం దేశాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
తన మనసులోని భావాలను, ఆలోచనలను పంచుకుంటారు. కేంద్ర సర్కార్ పని తీరు గురించి ప్రజలకు వివరిస్తారు. ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ కార్యక్రమంగా ఇది ప్రసిద్ది పొందింది. ఏప్రిల్ 30న ఐక్య రాజ్య సమితిలో కూడా ప్రసారం కానుంది. రేడియో మాధ్యమాన్ని ఇంత గొప్పగా వాడుకున్న ప్రధాని ఎవరూ లేరు.
Also Read : బైజు సిఇఓ రవీంద్రన్ ఇంట్లో సోదాలు