Ramiz Raja : బిలియ‌నీర్ ఆట‌గాళ్లు బోల్తా ప‌డ్డారు

పీసీబీ చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జా ఎద్దేవా

Ramiz Raja : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. నాకౌట్ నుంచే నిష్క్ర‌మిస్తుంద‌ని అనుకున్న పాకిస్తాన్ జ‌ట్టు అనుకోని రీతిలో అదృష్టం త‌లుపు త‌ట్టింది. ఏకంగా ఫైన‌ల్ కు చేరింది.

ఇక టైటిల్ ఫెవ‌రేట్ గా ఉంటూ ప్రారంభ మ్యాచ్ లోనే పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించిన రోహిత్ సేన ఊహించ‌ని రీతిలో ఇంగ్లండ్ చేతిలో సెమీస్ లో ఘోర‌మైన ఓట‌మిని చ‌వి చూసింది.

గ‌త ఏడాది దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో లీగ్ మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ జ‌ట్టు చేతిలో 10 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది భార‌త్ జ‌ట్టు. ఈ క్ర‌మంలో తాజా, మాజీ ఆట‌గాళ్లు పేల‌వ‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించిన టీమిండియాపై నిప్పులు చెరుగుతున్నారు.

ఇదే త‌రుణంలో సందు దొరికింది క‌దా అని త‌న అక్క‌సునంతా వెళ్ల‌గ‌క్కాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ రమీజ్ ర‌జా(Ramiz Raja). త‌మ జ‌ట్టులో అంతా సామాన్యులే ఉన్నార‌ని కానీ బిలియ‌నీర్ ఆట‌గాళ్లుగా పేరొందిన భార‌త క్రికెట‌ర్లు మాత్రం ఇంగ్లండ్ కొట్టిన దెబ్బ‌కు విల‌విల లాడి పోయార‌ని ఎద్దేవా చేశారు.

ఇదే స‌మ‌యంలో పాకిస్తాన్ దేశ ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్ కూడా టీమిండియా ఓట‌మిపై స్పందించాడు. ఆపై చుల‌క‌న చేస్తూ మాట్లాడాడు. ఇదే క్ర‌మంలో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ ఓట‌మి పొందిన స‌మ‌యంలో జింబాబ్వే దేశ అధ్య‌క్షుడు పాకిస్తాన్ పీఎంకు చుర‌క‌లు అంటించాడు.

మొత్తంగా హుందాగా ఉండాల్సిన క్రికెట్ బోర్డు చైర్మ‌న్ ఇలా నోరు పారేసు కోవ‌డంపై క్రికెట్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు.

Also Read : సానియా..షోయ‌బ్ బంధం ‘క‌లే’నా

Leave A Reply

Your Email Id will not be published!