Modi Stadium IPL 2022 : కోట్లాది కళ్లన్నీ మోదీ స్టేడియం పైనే
ప్రపంచంలోనే అతి పెద్ద మైదానం
Modi Stadium IPL 2022 : గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఆదివారం ఐపీఎల్ 2022 టైటిల్ ఫైనల్ పోరు గుజరాత్ టైటాన్స్ , రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య జరగనుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మైదానంగా ఇప్పటికే చరిత్ర సృష్టంచింది.
గతంలో దీని పేరు మొతేరా ఉండేది. మోదీగా స్టేడియం పేరు మార్చారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఈ స్టేడియంను అత్యాధునిక వసతులతో తీర్చి దిద్దారు.
ఐపీఎల్ క్వాలిఫయిర్ -2 మ్యాచ్ కు ఏకంగా లక్షా 10 వేల మంది ఈ స్టేడియంకు హాజరయ్యారు. ఇది ఓ రికార్డు అని చెప్పక తప్పదు. ఇవాళ జరిగే కీలక ఫైనల్ కు లక్షా 20 వేలకు పైగా దాట వచ్చని క్రీడా వర్గాల అంచనా.
కొత్తగా రూపొందించిన ఈ స్టేడియంలో ఇంగ్లండ్, ఇండియా జట్ల మధ్య మొదటిసారిగా పింక బాల్ టెస్టుకు ఆతిథ్యం ఇచ్చింది. రాష్ట్రపతి కోవింద్ దీనిని ప్రారంభించారు.
63 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ మోదీ స్టేడియం(Modi Stadium IPL 2022). దీనిని రూ. 800 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. నాలుగు ప్రపంచ స్థాయి డ్రెస్సింగ్ రూమ్ లతో వరల్డ్ లోనే నాలుగో అతి పెద్ద స్టేడియంగా చరిత్ర లో నిలిచి పోయింది మోదీ స్టేడియం.
11 సెంటర్ పిచ్ లు ఉన్న ఏకైక స్టేడియం ఇది. ఇందులో బౌలింగ్ మెషీన్లు , 4 డ్రెస్సింగ్ రూమ్ లతో కూడిన 6 ఇండోర్ పిచ్ లు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ స్టేడియంగా ఇప్పటికే పేరు పొందింది మోదీ స్టేడియం.
ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రానికే కాదు దేశానికి తలమానికంగా నిలిచింది ఈ మైదానం. ఇప్పుడు మరోసారి చరిత్రకు వేదిక కానుంది. ఐపీఎల్ 2022 టైటిల్ ఫైనల్ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది.
Also Read : డేవిడ్ మిల్లర్ కిల్లర్ అవుతాడా