BJP Rajyasabha List: 14 మందితో బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా !

14 మందితో బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా !

BJP Rajyasabha List: ఏప్రిల్ లో ఖాళీ కాబోయే 56 రాజ్యసభ స్థానాలకు సంబంధించి 15 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 8 నుంచి రాజ్యసభ ఎన్నిలకు దరఖాస్తులు స్వీకరణ మొదలవ్వగా… ఫిబ్రవరి 15తో ముగియనుంది. ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహించి అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్లకు గడువు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటిస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే ముగ్గురు సభ్యులతో అధికార వైసీపీ జాబితా ప్రకటించింది.

బెంగాల్‌ లో ఐదు స్థానాలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ నలుగురి పేర్లను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి కూడా తమ రాజ్యసభ అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది. బీజేపీ(BJP) అధిష్టానం ఏడు రాష్ట్రాల్లో మొత్తం 14 మంది రాజ్యసభ అభ్యర్ధులతో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఏడుగురు, బిహార్‌ నుండి ఇద్దరు, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, కర్ణాటక, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుండి ఒక్కో అభ్యర్ధి చొప్పున పేర్లు ఉన్నాయి.

BJP Rajyasabha List – బీజేపీ అభ్యర్ధుల్లో ఏ రాష్ట్రం నుంచి ఎవరంటే ?

ఉత్తరప్రదేశ్‌ – ఆర్‌పీఎన్‌ సింగ్‌, డా. సుధాన్షు త్రివేది, చౌదరి తేజ్‌వీర్‌ సింగ్‌, సాధనా సింగ్‌, అమర్‌పాల్‌ మౌర్య, సంగీత బల్వంత్‌, నవీన్‌ జైన్‌
బిహార్‌ – డా. ధర్మశీల గుప్తా, భీమ్‌ సింగ్‌
ఛత్తీస్‌గఢ్‌- రాజా దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌
హరియాణా – సుభాష్‌ బరాలా
కర్ణాటక – నారాయణ కష్ణస భండగే
ఉత్తరాఖండ్‌ – మహేంద్ర భట్‌
పశ్చిమబెంగాల్‌ – సమిక్‌ భట్టాచార్య

కేంద్ర ఎన్నికల సంఘం 15 రాష్ట్రాల్లో మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయగా…. వాటిలో అత్యధికంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో 10, బిహార్‌లో 6, మహారాష్ట్రలో 6, పశ్చిమబెంగాల్‌లో 5, మధ్యప్రదేశ్‌ 5, గుజరాత్‌ 4, కర్ణాటకలో 4, ఒడిశా, రాజస్థాన్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మూడేసి చొప్పున స్థానాలు, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో ఒక్కో రాజ్యసభ స్థానాలు ఉన్నాయి.

Also Read : Nara Lokesh: ఇచ్ఛాపురం నుండి ప్రారంభమైన నారా లోకేష్ ‘శంఖారావం’ యాత్ర !

Leave A Reply

Your Email Id will not be published!