BJP First List: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల !

195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల !

BJP First List: 2024 సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ(BJP) సమర శంఖం పూరించింది. రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయబోచే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్‌ డే… ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదిక ప్రకటించారు. మొదటి జాబితాలో మొత్తం 195 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) 16 రాష్ట్రాల్లోని అభ్యర్థిత్వాలపై తీవ్ర కసరత్తు చేసారు. ఈ క్రమంలో 195 అభ్యర్ధులతో తొలి జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, స్మృతీ ఇరానీ సహా 34 మంది కేంద్రమంత్రుల పేర్లను ప్రకటించారు. ఇందులో ఇద్దరు మాజీ మంత్రులు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు చోటు కల్పించారు.

BJP First List Viral

ప్రధాని మోదీ ఇక బీజేపీ విడుదల చేసిన తొలి జాబితా విషయానికి వస్తే…. ఈ తొలి జాబితాలో 28 మంది మహిళలు ఉన్నారు. యువతకు 47 స్థానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు కేటాయించినట్లు వినోద్‌ తావ్‌డే తెలిపారు. తొలి జాబితాలో 57 మంది ఓబీసీలకు చోటు కల్పించారు. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా యూపీ నుంచి 51 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌ – 20, మధ్యప్రదేశ్‌- 24, గుజరాత్‌- 15, రాజస్థాన్‌ -15, కేరళ-12, తెలంగాణ-9, ఝార్ఖండ్‌-11, ఛత్తీస్‌గఢ్‌-12, దిల్లీ-5, జమ్మూకశ్మీర్‌-2, ఉత్తరాఖండ్‌-3, అరుణాచల్‌ ప్రదేశ్‌-2, గోవా, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, దమన్‌ అండ్‌ దీవ్‌ నుంచి ఒక్కో అభ్యర్థిని ప్రకటించారు. ఈ జాబితాలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, స్మృతీ ఇరానీ, మన్‌ సుఖ్‌ మాండవీయ, జితేంద్ర సింగ్‌, సర్బానంద సోనోవాల్‌, గజేంద్ర షెకావత్‌, భూపేంద్ర యాదవ్‌, కిషన్‌ రెడ్డి, కిరెన్‌ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్‌ చంద్రశేఖర్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, అర్జున్‌ ముండా చోటు దక్కించుకున్నారు.

తొలి జాబితాలో 9 మంది తెలంగాణ అభ్యర్థులు !

తెలంగాణాకు సంబంధించి మొత్తం 9 మంది అభ్యర్ధులను ప్రకటించారు. వారిలో కరీంనగర్‌ – బండి సంజయ్‌కుమార్‌, నిజామాబాద్‌- ధర్మపురి అరవింద్‌, జహీరాబాద్‌- బీబీ పాటిల్‌, మల్కాజ్‌గిరి- ఈటెల రాజేందర్‌, సికింద్రాబాద్‌- కిషన్‌ రెడ్డి, హైదరాబాద్‌- డాక్టర్‌ మాధవీ లత, చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, నాగర్‌ కర్నూల్‌- పి.భరత్‌, భువనగిరి- బూర నర్సయ్య గౌడ్‌ ఉన్నారు.

Also Read : Adinarayana Reddy BJP : ఏపీలో టీడీపీ-జనసేన పొత్తులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!