Rushikonda Palace : రుషికొండ ప్యాలెస్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే

రూ. 409 కోట్ల వ్యయం చేస్తే 22 వేల 743 మందికి పేదలకు ఇల్లు కట్టవచ్చునని అన్నారు...

Rushikonda : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది . ఈ సందర్బంగా విశాఖలో రుషికొండ(Rushikonda)పై జగన్ నిర్మించిన ప్యాలెస్‌పై అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు(Vishnu Kumar Raju) మాట్లాడుతూ.. రుషికొండపై నిర్మాణాలకు రూ. 409 కోట్లు కేటాయించారని, ఈ నిర్మాణాలు జగన్ విధ్వంసానికి పరాకాష్ట అని అన్నారు. అక్కడకు ఎవరిని వెళ్లనీవ్వకుండా అడ్డుకున్నారని, మేము ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేస్తే అతి కష్టం మీద నెల తరువాత సమాధానం వచ్చిందన్నారు.

Rushikonda Palace..

రుషికొండ (Rushikonda)రిసార్ట్స్‌ను జగన్ కావాలనే డిస్ట్రక్షన్ ప్రారంభించారని, రిసార్డ్‌లను కూల్చేసి ఏమి కడుతున్నారో కూడా ఎవరికీ చెప్పలేదని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక నియంత పాలనలో అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా అభ్యంతరాలు ఉన్నాయన్నారు. 1 లక్ష 40 వేల చదరపు అడుగులు నిర్మాణాలు చేసారని, దీనికి మాత్రం 451 కోట్లు రూపాయలు నిధులు శాంక్షన్ చేసారన్నారు. చదరపు అడుగు నిర్మాణానికి 28 వేల 096 రూపాయలు ఖర్చు అయిందని, ఇంత ఖర్చు పెట్టీ పేదలకు, పెద్దలకు పోరాటం అని పేర్కొంటూ జగన్ బిల్డ్ అప్ ఇచ్చారని ఎద్దేవా చేశారు.

రూ. 409 కోట్ల వ్యయం చేస్తే 22 వేల 743 మందికి పేదలకు ఇల్లు కట్టవచ్చునని అన్నారు. నిర్మాణాలకు ఖర్చు చదరపు అడుగు 24 వేల రూపాయలకు నిర్మించారని, ఫర్నిచర్ ఖరీదు రూ. 22 కోట్లు వ్యయం చేశారన్నారు. ముందు టూరిజం రిసార్ట్ అని చెప్పి ఆ తరువాత జీవో ఇచ్చారని అన్నారు. ముఖ్యమంత్రికి క్యాంప్ ఆఫీస్‌ను వెతికేందుకు ఒక కమిటీ వేసి రుషికొండ ప్యాలెస్‌ను సిఎంకు కేటాయించాలని కమిటీ సిఫార్సు చేసిందని, బాత్ రూంలో కమ్ ఔట్ ఖరీదు రూ. 16 లక్షలు అంట అని విష్ణుకుమార్ రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెట్టారని, తెలుగు వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా బాధపడ్డారని అన్నారు. మరి ఇంత దుర్వినియోగం చేసిన జగన్ జీవిత కాలం జైలులో ఉంచాలి కదా అని విష్ణు కుమార్ రాజు అన్నారు. అధికార దుర్వినియోగంపై ప్రజలు తగిన బుద్ధి చెప్పారని దీనిపై వెంటనే చర్చ చేపట్టి జగన్‌ను జైల్లో పెట్టాలని విష్ణు కుమార్ రాజు అన్నారు.

రుషికొండపైతాను హైకోర్టుకు వెళ్లానని.. తనపై సుప్రీం కోర్టుకు కూడా అబద్ధం చెప్పారని రఘురామ కృష్ణం రాజు అన్నారు. సిఎం నివాసం కోసం అని చెబితే అది అబద్ధం అని కోర్టుకు చెప్పారన్నారు. అప్పటి వరకు టూరిజం ప్రాజెక్టు అని చెప్పి ఆ తరువాత సిఎంకు నివాసం అని చెప్పారన్నారు. అధికారుల కమిటీ వెళ్తుంటే వాళ్లకు రుషికొండ నివాసం కనిపించిందట..వెంటనే వాళ్ళు రుషికొండ సిఎం నివాసానికి పనికొస్తుందని చెప్పారన్నారు. రూ. 400 కోట్లు పెట్టీ జగన్ రాజకీయ సమాధి కట్టుకున్నారని, మనం నెగెటివ్‌లో కూడా పాజిటివ్ వెతుక్కోవాలన్నారు. ఈ ప్యాలెస్ కట్టడం వలనే జగన్ పతనం ప్రారంభమైందన్నారు. ఈ కట్టడాన్ని మంచి భవనంగా తీర్చి దిద్దాలన్నారు. అందరి మనోభావాలను తెలుసుకున్న తరువాత దీనిపై సోమవారం ప్రత్యేక చర్చ చేపట్టాలని నిర్ణయం తీసుకుందామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. దీంతో రుషికొండపై చర్చ ముగిసింది.

Also Read : CM Siddaramaiah : తప్పుడు కేసులతో నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు

Leave A Reply

Your Email Id will not be published!