BJP Rajya Sabha List : 16 మంది బీజేపీ అభ్యర్థులు డిక్లేర్
రాజ్యసభ ఎన్నికలకు ఖరారు
BJP Rajya Sabha List : భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు ఉత్కంఠకు తెర దించింది. మొత్తం 15 రాష్ట్రాలలో 57 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ తర్జన భర్జనలు చేసిన అనంతరం 16 మంది అభ్యర్థులను(BJP Rajya Sabha List) ఖరారు చేసింది.
జాబితాను ప్రకటించింది అధికారికంగా. జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మొత్తం 16 మంది లో ప్రముఖులు కూడా ఉన్నారు.
వారిలో ప్రస్తుతం దేశ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి , మహారాష్ట్ర నుండి వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను ఖరారు చేసింది. వీరిద్దరూ ప్రస్తుతం కేబినెట్(BJP Rajya Sabha List) లో కీలక పదవులు నిర్వహిస్తున్నారు.
ఇక వీరి పదవీ కాలం కూడా ముగుస్తుండడంతో తిరిగి వీరికి జాబితాలో చోటు కల్పించింది. ఇదిలా ఉండగా ఊహించని రీతిలో మైనార్టీ వ్యవహారాల
శాఖ మంత్రి ముఖ్తార్ అబ్సాస్ నఖ్వీ పదవీ కాలం కూడా ముగుస్తుంది.
కానీ సోమవారం ప్రకటించిన అధికారిక బీజేపీ జాబితాలో ఆయన పేరు లేదు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఉత్తర ప్రదేశ్
నుండి లక్ష్మీ కాంత్ వాజ్ పేయి, రాధా మోహన్ అగర్వాల్ , సురేంద్ర నగర్ , బాబు రామ్ నిషాద్ , దర్శనా సింగ్ , సంగీతా యాదవ్ లను ఎంపిక చేసింది.
వీరంతా యూపీ నుంచే ఉన్నారు. మొత్తం 11 మందిని ఎంపిక చేయడం విశేషం. మహారాష్ట్రలో 6 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా
పీయూష్ గోయల్ మినహా బీజేపీ తన జాబితాలో మరాఠాకు చెందిన అనిల్ బోండే పేరును ప్రకటించింది.
రాజస్తాన్ నుంచి ఘన్ శ్యామ్ తివారీ, ఉత్తరాఖండ్ నుంచి కల్పనా షైనీ, బీహార్ నుంచి సతీష్ చంద్ర దూబే, శంభు శరణ్ పటేల్ , హర్యానా
నుంచి క్రిషన్ లాల్ పన్వార , ఎంపీ నుంచి కవితా పాటిదార్ , కర్ణాటక నుంచి జగ్జేశ్ ఉన్నారు.
Also Read : రాకేష్ తికాయత్ పై ఇంకు దాడి