Sanna Irshad Mattoo : కారణం లేకుండానే అడ్డుకున్నారు

పులిట్జ‌ర్ విజేత స‌న్నా ఇర్షాద్ ఆరోప‌ణ

Sanna Irshad Mattoo : జ‌మ్మూ కాశ్మీర్ కు చెందిన పులిట్జ‌ర్ విజేత స‌న్నా ఇర్షాద్ మ‌ట్టూ(Sanna Irshad Mattoo) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాను ఫోటో జ‌ర్న‌లిస్ట్ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు పారిస్ కు వెళ్ల‌డానికి విమానం ఎక్క‌కుండా ఢిల్లీలో ఆపి వేశారంటూ ఆరోపించారు.

ఈ విష‌యాన్ని ఆమె త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. ఎలాంటి కార‌ణం చూప‌కుండానే ఆపి వేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. బోర్డింగ్ పాస్ , పాస్ పోర్ట్ ఫోటోను కూడా షేర్ చేసింది.

ఎరుపు సిరాతో ముద్రించారంటూ తెలిపింది స‌న్నా ఇర్షాద్ మ‌ట్టూ. దీంతో తాను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోనే ఉండి పోయాన‌ని వాపోయింది. అయితే త‌న‌ను ఎందుకు ఆపాల్సి వ‌చ్చింద‌న్న ప్ర‌శ్న‌కు ఎయిర్ పోర్ట్ ఆఫీస‌ర్లు చెప్ప‌లేద‌ని ఆరోపించారు.

సెరెండిపిటీ ఆర్లెస్ గ్రాంట్ 2020లో 10 మంది అవార్డు విజేత‌ల‌లో ఒక‌రిగా పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌, ఫోటోగ్రఫీ ఎగ్జిబిష‌న్ కోసం నేను ఢిల్లీ నుండి పారిస్ కు వెళ్లాల్సి ఉంది.

ఫ్రెంచ్ వీసాను సంపాదించినా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోని ఇమ్మిగ్రేష‌న్ డెస్క్ వ‌ద్ద త‌న‌ను ఆపారంటూ మండిప‌డ్డారు. ఎలాంటి కార‌ణం లేకుండా ఎలా ఆపుతారంటూ ప్ర‌శ్నించింది.

ఇదిలా ఉండ‌గా మ‌ట్టూపై జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు లుక్ అవుట్ స‌ర్కుల‌ర్ జారీ చేశారు. అందుకే ఆమె విదేశాల‌కు వెళ్ల‌కుండా ఆపి వేసిన‌ట్లు సమాచారం. ఇదిలా ఉండ‌గా ఒక వ్య‌క్తి దేశం నుంచి ఎక్క‌డికీ వెళ్ల‌కుండా జారీ చేసే ఆదేశ‌మే ఈ లుక్ అవుట్ నోటీస్.

Also Read : అమృత ఫ‌డ్న‌వీస్ కు అరుదైన గౌర‌వం

Leave A Reply

Your Email Id will not be published!