Swara Bhasker Marriage : ఫహాద్ తో నటి స్వర భాస్కర్ పెళ్లి
సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియో వైరల్
Swara Bhasker Marriage : బాలీవుడ్ ముద్దుగుమ్మ స్వర భాస్కర్ పెళ్లి(Swara Bhasker Marriage) చేసుకుంది. తనకంటే నాలుగు సంవత్సరాలు చిన్న వాడైన సమాజ్ వాది పార్టీకి చెందిన పహాద్ అహ్మద్ ను మనువాడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను , వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది స్వర భాస్కర్. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఎక్కడ చూసినా ఆమె ఫోటోలే దర్శనం ఇస్తున్నాయి. అద్భుతమైన అందమే కాదు ఆకట్టుకునేలా డ్రెస్ లతో తయారైంది స్వర భాస్కర్.
ఇటీవల బాలీవుడ్ రంగానికి చెందిన నటీమణులు ఏదో ఒక కారణంతో బయటకు వస్తున్నారు. వార్తల్లో నిలుస్తున్నారు. అంత లోపే హాట్ టాపిక్ గా మారుతున్నారు. తామిద్దరం పెళ్లి చేసుకున్నామని మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీర్వాదం కావాలని ఈ సందర్భంగా కోరారు నటి స్వర భాస్కర్.
తాను, పహాద్ అహ్మద్ కలిసి గత నెల జనవరి 6న పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా ఫహాద్ అహ్మద్ సమాజ్ వాది పార్టీ యువజన సభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మేం గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నాం. స్నేహితులయ్యాం.
ఆ తర్వాత ఒక్కటి కావాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు నటి స్వర భాస్కర్(Swara Bhasker Marriage). ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. తెలుసుకున్నాం..చివరకు కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నాం. కొంత ఆలస్యమైనా చివరకు ఒక్కటమయ్యామని స్వర భాస్కర్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా 40 రోజుల తర్వాత పెళ్లి విషయాన్ని వెల్లడించింది. స్వర పహాద్ తో కోర్టులో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది స్వర భాస్కర్.
Also Read : మల్లికా సాగర్ సూపర్ – కార్తీక్