Ganesh Acharya : గ‌ణేశ్ ఆచార్య మామూలోడు కాదు

లైంగికంగా వేధించాడంటూ కేసు

Ganesh Acharya : ఇప్ప‌టికే సినీ ఇండస్ట్రీలో (Industry) క్యాస్టింగ్ కౌచ్ తో అట్టుడుకుతోంది. ఈ త‌రుణంలో అవ‌కాశాలు ఇప్పిస్తామంటూ కొంద‌రు మోసం చేయ‌డం ప‌రిపాటిగా మారింది. కొంద‌రు బ‌య‌ట‌కు చెప్ప‌లేక ఇంకొంద‌రు తెర వెనుక ఉండి పోతున్నారు.

వేలాది మంది ఈ బాధితులుగా ఉన్న వారే. ఒక వేళ ఏమైనా ఆరోప‌ణ‌లు చేస్తే ఆధారాలు చూపించాలి. చాలా మంది కేసులు, వేధింపులు త‌ట్టుకోలేక సినీ కెరీర్ నుంచి దూర‌మైన వాళ్లే ఉన్నారు.

తాజాగా లైంగిక వేధింపుల కేసులో ప్ర‌ముఖ కొరియో గ్రాఫ‌ర్ (Choreographer) గ‌ణేష్ ఆచార్య‌(Ganesh Acharya)పై ఛార్జిషీట్ దాఖ‌లైంది. ఆయ‌న‌తో పాటు అత‌డి అసిస్టెంట్ పై 354- ఏ, 354 – సి, 354-డి సెక్ష‌న్ల కింద అభియోగాలు న‌మోదు చేశారు.

2020లో త‌న‌ను లైంగికంగా వేధింపుల‌కు గురి చేశాడ‌ని , ఆచార్య‌కు అసిస్టెంట్ గా ప‌ని చేసిన మ‌హిళ కొరియోగ్రాఫ‌ర్ ఫిర్యాదు చేసింది. త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ వాపోయింది.

అంతే కాకుండా బూతు ఉన్న వీడియోలు కూడా చూపించాడ‌ని, అలా చేయమంటూ బ‌లవంతానికి గురి చేశాడంటూ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యింది. తాను చెప్పిన‌ట్లు చేస్తే ఇండ‌స్ట్రీలో ఛాన్స్ లు ఇప్పిస్తానంటూ మ‌భ్య పెట్టాడ‌ని ఆరోపించింది.

తాను నిరాక‌రిచ‌డంతో ఆరు నెల‌ల్లోనే ఎఫ్‌టీసీఏలో స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయించాడంటూ వాపోయింది. తన అసిస్టెంట్స్ తో దాడి చేయించాడంటూ తెలిపింది బాధితురాలు.

ఇదిలా ఉండ‌గా ఈ ఫిర్యాదుపై ఇంకా స్పందించ లేదు ప్ర‌ముఖ‌ కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేశ్ ఆచార్య‌(Ganesh Acharya). అయితే తాను లాయ‌ర్ తో సంప్ర‌దించాన‌ని బాధితురాలు వెల్ల‌డించింది.

Also Read : అత్యంత ప్ర‌భావిత కంపెనీల‌లో సోనీ టాప్

Leave A Reply

Your Email Id will not be published!