Boria Majumder : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారత జట్టు వికెట్ కీపర్ వృద్ది మాన్ సాహా వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇంటర్వ్యూ కోసం తనను సదరు జర్నలిస్ట్ బెదిరించాడంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
తనకు తిరుగే లేదంటూ బీసీసీఐ చీఫ్ గంగూలీ చెబితే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రిటైర్మెంట్ గురించి ఆలోచించమని చెప్పాడంటూ బాంబు పేల్చాడు.
ఈ తరుణంలో ఉన్నట్టుండి తనను బెదిరింపులకు గురి చేసిన జర్నలిస్ట్ గురించి తాను బయటకు చెప్పలేనంటూ పేర్కొన్నాడు. ఇదే వ్యవహారంపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది.
ఇందుకు సంబంధించి బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా సదరు కమిటీ వృద్ది మాన్ సాహాను విచారించింది.
బయటకు చెప్పక పోయినా తర్వాత భరోసా ఇవ్వడంతో సాహా కమిటీ ముందు సదరు జర్నలిస్టు బోరియానేనంటూ(Boria Majumder) స్పష్టం చేశాడు. దీంతో బోరియా స్పందించాడు.
సాహాపై పరువు నష్టం దావా వేశాడు ఇంటర్వ్యూ కోసం సాహాతో చాట్ చేసింది వాస్తవమేనంటూ తెలిపాడు. అయితే తన మెసేజ్ లను సాహా టాంపరింగ్ చేశాడంటూ ఆరోపించాడు.
అంతే కాకుండా టెస్టు జట్టులో చోటు దక్కదని తెలిసిన సాహా సానుభూతి పొందాలనే తనపై ఆరోపణలు చేశాడంటూ మండిపడ్డాడు. సాహా సోషల్ మీడియాలో షేర్ చేసిన చాట్స్ నకిలీవని ఒరిజనల్ మెసేజ్ లు కోర్టులో సమర్పిస్తానని పేర్కొన్నాడు.
ఈ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోవాలని కోరాడు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ లో వీడియో కూడా షేర్ చేశాడు బోరియా.
Also Read : చెలరేగిన భారత్ తలవంచిన పాకిస్తాన్