Saba Karim : ఆ ఇద్దరికీ భారత్ కు కెప్టెన్ అయ్యే చాన్స్
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ సబా కరీం
Saba Karim : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ సబా కరీం షాకింగ్ కామెంట్స్ చేశారు. కేఎల్ రాహుల్ , రిషబ్ పంత్(Rishab Pant) లకు టీమిండియాకు భవిష్యత్తులో మూడు ఫార్మాట్ లకు కెప్టెన్ అయ్యే చాన్స్ ఉందని పేర్కొన్నాడు.
ఇంగ్లండ్, వెస్టిండీస్ , జింబాబ్వే టూర్లలో భారత జట్టు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని ప్రశంసించాడు. బీసీసీఐ మూడు ఫార్మాట్ లకు సంబంధించి ఎవరినో ఒకరిని పూర్తి స్థాయిలో, పూర్తి కాలం పాటు కెప్టెన్ ను ఉండాలని సూచించాడు సబా కరీం.
కేఎల్ రాహుల్(KL Rahul) , పంత్ అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొన్నాడు. పంత్ వైట్ బాల్ ప్లేయర్ గా కూడా ఎదిగాడని తెలిపాడు. రోహిత్ శర్మ తన గాయం కారణంగా ఎంత కాలం కొనసాగించగలడనేది నంబర్ వన్ ఉంటాడని ప్రశ్నించాడు సబా కరీం(Saba Karim).
యువ నాయకుడిగా పంత్ మాత్రమే చాన్స్ ఉందన్నాడు. కాబట్టి సెలెక్టర్లు ఈ విషయం గురించి ఆలోచించాలన్నాడు. రాబోయే కాలంలో కేఎల్ రాహుల్, పంత్ మధ్యే కెప్టెన్సీ విషయంలో పోటీ నెలకొందన్నారు.
జింబాబ్వే పర్యటనలో కెప్టెన్ గా తిరిగి జాతీయ జట్టుకు తిరిగి రావడం కూడా అదనపు బలం చేకూర్చిందని పేర్కొన్నారు సబా కరీం. ఏది ఏమైనా ప్రధాన పోటీ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మధ్యనే ఉండబోతుందని మరోసారి స్పష్టం చేశారు మాజీ క్రికెటర్.
ఇదిలా ఉండగా ఆగస్టు 27 నుండి యూఏఈ వేదికగా ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్(Asia Cup 2022) జరగనుంది. దాయాదులైన భారత్ , పాకిస్తాన్ జట్ల మధ్య ఆగస్టు 28న కీలక మ్యాచ్ కోసం వేలాది మంది వేచి చూస్తున్నారు.
Also Read : ఫిఫాతో కేంద్ర ప్రభుత్వం చర్చలు