Botsa Satyanarayana : విశాఖ పోర్టుకు దిగుమతైన డ్రగ్స్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసిన బొత్స

అప్పట్లో సిట్‌ను ఓపెన్ చేయమని తాను కూడా మా ప్రభుత్వాన్ని అడిగానని...

Botsa Satyanarayana : మార్చి 22న విశాఖ పోర్టుకు దిగుమతైన రూ. 25 వేల కోట్ల డ్రగ్స్ కేసు ఏమైందని.. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ సంస్ధ ఇంపోర్ట్ చేసినట్లు అప్పట్లో తెలిపారని.. ఆ సంస్ధతో బీజేపీ పెద్దలకు సంబంధాలున్నాయని తెలిసిందని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు వైసీపీ పార్టీపై నిందలు వేశారని, పార్లమెంటులో ఎంపీలు ఈ విషయాన్ని ప్రశ్నించాలని, వాస్తవాలు ఏంటి? ఎందుకు ఉపేక్షిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Botsa Satyanarayana Comment

గుజరాత్, మహారాష్ట్ర ల నుంచి డ్రగ్స్ ఇంపోర్ట్ అవుతుండటం చూశామని, విశాఖ పోర్టుకు ఎప్పుడూ ఇలాంటి మచ్చరాలేదని బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అన్నారు. చిత్తశుద్ది వుంటే స్ధానిక నాయకత్వం వెంటనే నివేదిక తెప్పించాలన్నారు. ఎన్నికల సమయమని రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు అప్పట్లో వద్దనుకున్నామని, ఎవరిమీదో బురద చల్లడానికి తాను అడగడంలేదన్నారు. ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష వేయాలని.. భూ కుంభకోణాలపై టీడీపీ హయాంలో వేసిన సిట్ నివేదికను బయటపెట్టాలన్నారు. సిట్ దర్యాప్తును 2004 వరకు కూడా పొడిగించారని.. తమ హయాంలో వేసిన సిట్ నివేదికను ఒత్తిళ్ల వల్ల విడుదల చేయలేకపోయామని చెప్పారు.

అప్పట్లో సిట్‌ను ఓపెన్ చేయమని తాను కూడా మా ప్రభుత్వాన్ని అడిగానని.. భూ ఆక్రమణలు ఎవరు చేశారో నిగ్గు తేల్చాలని బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అన్నారు. వైఫల్యం చెందామనే మమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టారని.. జగన్ మీద ఎన్ని కేసులు వున్నాయో చంద్రబాబు మీద కూడా అన్నే ఉన్నాయన్నారు. 45 రోజుల్లో హత్యకు గురైన 36 మంది పేర్లు చెపుతామన్నారు. అసెంబ్లీకి వెళ్లమని తాను వైసీపీ ఎమ్మెల్యేలకు ఎలా చెప్పగలను… తాను ఎమ్మెల్యేను కాదని అన్నారు. ఏపీ అప్పుల పాలైందని….శ్రీలంక, సోమాలియాలా మారిపోతోందని అప్పట్లో చంద్రబాబు చెప్పారని.. తనకు సంపద సృష్టి తెలుసునని చంద్రబాబు అన్నారని…ఏమి చేస్తారో చూద్దామని.. కొద్ది రోజులు ఆగితే విషయాలు తెలుస్తాయన్నారు. తల్లికి వందనం కింద ఇచ్చిన వగ్దానాలు అమలు చేయాలనే కోరుకుంటున్నామని.. ఖజానాలో డబ్బులు వుంటే ఇవ్వచ్చునన్నారు. అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు ఆర్ధిక సంస్ధల నుంచి ఫెసిలిటేట్ చేస్తామన్నారు… కాబట్టి తిరిగి ఈమొత్తం చెల్లించాలి… ఇండియా కూటమి నాయకులతో కలిస్తే తప్పేంటని బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు.

Also Read : Rajendranath Reddy : చంద్రబాబు శ్వేతపత్రంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!