Boxer Vijender Singh : రెజ్ల‌ర్ల ధ‌ర్నాలో బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్

మ‌హిళా రెజ్ల‌ర్ల ఆందోళ‌న‌కు భారీ మ‌ద్ద‌తు

Boxer Vijender Singh : డ‌బ్ల్యుఎఫ్ఐ చీఫ్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ ను తొల‌గించాల‌ని, లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్న అత‌డిని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని కోరుతూ మ‌హ‌ళా రెజ్ల‌ర్లు ఆందోళ‌న బాట పట్టారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ లోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష శుక్ర‌వారం నాటికి మూడోరోజుకు చేరుకుంది.

ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్వాతి మ‌ళివాల్ సంద‌ర్శించి మ‌ద్ద‌తు తెలిపారు. బాధిత మ‌హిళ‌ల‌తో మాట్లాడారు. ఈ మేర‌కు డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ సింగ్ తో పాటు మిగ‌తా కోచ్ లు, స్పోర్స్ కార్య‌ద‌ర్శిగా నోటీసులు జారీ చేశారు. మ‌హిళా రెజ్ల‌ర్లు చేస్తున్న ఆంద‌ళ‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు ప్ర‌ముఖ బార‌తీయ బాక్స‌ర్ విజేంంద‌ర్ సింగ్(Boxer Vijender Singh) . ఈ మేర‌కు ఆయ‌న ధ‌ర్నాలో పాల్గొన్నారు. సంఘీభావం ప్ర‌క‌టించారు.

వినేష్ ఫోగ‌ట్ , సాక్షి మాలిక్ , బ‌జ్ రంగ్ పూనియా తో స‌హా 30 మందికి పైగా మ‌హిళా రెజ్ల‌ర్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి శాంతియుతంగా నిర‌స‌న తెలిపారు. ఎలాంటి రాజ‌కీయ పార్టీల మ‌ద్ద‌తు తాము కోరుకోవ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే తమ వ‌ద్ద‌కు వ‌చ్చిన సీపీఎం నాయ‌కురాలు బృందా కార‌త్ ను వెన‌క్కి పంపించారు.

ఇది త‌మ స‌మ‌స్య అని తామే తేల్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు మ‌హిళా రెజ్ల‌ర్లు. ఆయ‌న 2019లో హ‌ర్యానాలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. రెజ్ల‌ర్లు చేస్తున్న న్యాయ ప‌ర‌మైన దీక్ష‌కు తాను కూడా మ‌ద్ద‌తు తెలియ చేస్తున్నాన‌ని, పార్టీ ప‌రంగా తాను ఇక్క‌డికి రాలేద‌న్నారు.

Also Read : బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్ కు నో ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!