BPCL Bid : బీపీసీఎల్ పై వెనక్కి తగ్గిన కేంద్రం
ముందుకు రాని బిడ్డర్లతో పరేషాన్
BPCL Bid : దేశంలో కొలువు తీరిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం గంపగుత్తగా ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెట్టింది. డిజిన్వెస్ట్ మెంట్ పేరుతో ప్రైవేట్ పరం చేసే పనిలో పడ్డది. ఇప్పటికే నవరత్నాలను సైతం వ్యాపారవేత్తలకు అప్పగించే ఆలోచనలో ఉంది మోదీ ప్రభుత్వం.
తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్(BPCL Bid) (బీపీసీఎల్ ) కంపెనీ ప్రభుత్వానికి చెందింది. ఇప్పటి వరకు కొన్నేళ్లుగా విశిష్ట సేవలు అందిస్తూ వస్తోంది. దీ
నిపై కూడా కేంద్రం కన్నేసింది. వ్యాపారవేత్తలకు, ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు బిడ్డర్లను ఆహ్వానించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి బీపీసీఎల్ లో ఏకంగా 52. 98 శాతం వాటా కలిగి ఉంది.
కనీసం కొంత మొత్తమైనా పెట్టుకుని ఉంటే బాగుండేది. కానీ మొత్తానికి మొత్తం అమ్మేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు బిడ్ లను కూడా ఆహ్వానించింది. ఇందుకు సంబంధించి బిడ్డర్ల నుంచ ఆసక్తి వ్యక్తీకరణ కోసం ఆహ్వానించింది.
2020 సంవత్సరానికి కేవలం మూడు బిడ్స్ మాత్రమే అందాయి. ఇందులో ఒక బిడ్డర్ మాత్రమే మిగలడంతో కేంద్రం అప్పగించే ప్రక్రియను వాయిదా వేసింది.
ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వెనక్కి తగ్గిందనే చెప్పక తప్పదు. ఉక్రెయిన్ పై రష్యా యుద్దం చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ లో ఆసక్తికరంగా పరిణామాలు లేవు.
సహజ వాయువుల పరిశ్రమలన్నీ ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ తరుణంలో ఎవరూ ముందుకు రాక పోవడం కూడా ప్రధాన కారణం.
ఇక ఉన్న వాటిని అమ్మేసి దేశాన్ని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించాలనేది ప్రభుత్వ ఆలోచన. దీనిపై తీవ్రంగా మండి పడుతున్నాయి విపక్షాలు.
Also Read : తెలంగాణతో మాస్టర్ కార్డ్స్ ఒప్పందం