Brian Lara : ఐపీఎల్ లో వరుసగా ఐదు విజయాలు సాధిస్తూ చుక్కలు చూపిస్తున్న సన్ రైజర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రధానంగా ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కేవలం 68 పరుగులకే కట్టడి చేసింది.
ఇందులో ప్రధానంగా మ్యాచ్ ఆరంభంలోనే రెండో ఓవర్ లో మూడు కీలక వికెట్లు తీశాడు జాన్సెన్. ఏకంగా 4 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇందులో భారత్ స్టార్ విరాట్ కోహ్లీతో పాటు బెంగళూరు స్కిప్పర్ డుప్లెసిస్ కూడా ఉన్నాడు.
దీంతో బెంగళూరును ఊహించని రీతిలో దెబ్బ కొట్టాడు జాన్సెన్. దీంతో సన్ రైజర్స్ ఇంకా 72 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది. విచిత్రం ఏమింటే అదే ఓవర్ లో అనుజ్ రావత్ ను కూడా వెనక్కి పంపించాడు.
దీంతో ఆ జట్టు 8 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. జాన్సెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. అతడితో పాటు టి. నటరాజన్ సైతం 3 వికెట్లు తీశాడు. లారాను (Brian Lara)సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తీసుకుంది.
ఈ సందర్భంగా మాకు కొంత మంది మంచి బౌలర్లు ఉన్నారు. పాత జట్టు నుంచి భువీ, నటరాజన్ లను తీసుకున్నాం. ఇద్దరు యువకులను జోడించామన్నాడు.
మార్కో జాన్సెన్ ముంబై ఎందుకు తీసుకోలేదో అర్థం కాలేదన్నాడు లారా. వయస్సులో చిన్న వాడైనా పరిణతి చెందిన ఆటగాళ్ల సరసన నిలిచేలా ఆడుతున్నాడని కితాబు ఇచ్చాడు ఈ క్రికెట్ దిగ్గజం.
Also Read : కోహ్లీ ఇలా ఆడితే కెరీర్ కష్టం