Brian Lara : సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్, ప్రపంచ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా(Brian Lara )సంచలన కామెంట్స్ చేశాడు. తమ జట్టులో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆఫ్గనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అతడు లేక పోయినా తమ జట్టు అద్భుత విజయాలు నమోదు చేస్తూ వస్తోందన్నాడు. అంతా అనుకున్నట్టు రషీద్ ఖాన్ కేర్ టేకర్ కాదని కుండ బద్దలు కొట్టాడు. అతడు బౌలరే కాని రషీద్ ఖాన్ ను మించిన బౌలర్లు వరల్డ్ లో చాలా మంది ఉన్నారని సెటైర్ వేశారు.
ఖాన్ కంటే అద్భుతమైన బౌలర్లు సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఉన్నారంటూ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఎస్ ఆర్ హెచ్ లో సుదర్ఘ కాలం పాటు ఆడిన రషీద్ ఖాన్ వేలం పాటలో హైదరాబాద్ నుంచి తప్పుకున్నాడు.
అతడు తమతో లేకున్నా జరిగే నష్టం ఏమీ లేదన్నాడు. బ్యాటర్లు డిఫెన్స్ ఆడేందుకు యత్నిస్తారని, అదే వికెట్లను సమర్పించు కునేలా చేస్తుంది తప్ప అతడి టాలెంట్ వల్ల కాదని ఎద్దేవా చేశాడు బ్రియాన్ లారా.
అయితే పనిలో పనిగా ఖాన్ ఐపీఎల్ లో చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తాడన్నాడు. 2017 నుంచి 2021 వరకు సన్ రైజర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు రషీద్ ఖాన్. ప్రస్తుతం ఐపీఎల్ లో 100 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
ఏది ఏమైనా బ్రియాన్ లారా చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ వర్గాలలో కలకలం రేపాయి. మొత్తంగా లారా వచ్చాక హైదరాబాద్ జట్టు ఆట తీరే మారి పోయిందనడంలో సందేహం లేదు.
Also Read : అంబటి రాయుడు అదుర్స్