Brij Bhushan Harassing : డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ కామాంధుడు

భార‌త మ‌హిళా రెజ్ల‌ర్ల ఆందోళ‌న

Brij Bhushan Harassing : భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం కేంద్రంలో కొలువు తీరాక దేశంలో మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు మ‌రింత పెరిగాయి. మ‌హిళ‌ల‌ను కేవ‌లం ఆట వ‌స్తువుగా చూడ‌టం మొద‌లైంది. తాజాగా భార‌త రెజ్ల‌ర్స్ సంఘం ప్రెసిడెంట్ , బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు భార‌త మ‌హిళా రెజ్ల‌ర్లు(Brij Bhushan Harassing).

30 మంది రోడ్డుపైకి వ‌చ్చారు. ఆయ‌న‌ను వెంట‌నే త‌ప్పించాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌పై స్పందించేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ రెజ్లింగ్ సంస్థ‌కు 72 గంట‌ల స‌మ‌యం ఇచ్చింది. స్పోర్ట్స్ బాడీ కోచ్ లు, చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై ఒలింపియ‌న్ రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ మ‌హిళా రెజ్ల‌ర్ల‌ను లైంగికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నాడంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది.

దీంతో మంత్రిత్వ శాఖ వెంట‌నే స్పందించింది. డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ నుండి వివ‌ర‌ణ కోరింది. త‌న‌ను చంపుతామంటూ బెదిరింపులు కూడా వ‌చ్చాయ‌ని వాపోయింది ఫోగ‌ట్. ఆసియా, కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో విజేత‌గా నిలిచిన ఫోగ‌ట్ , ఇత‌ర రెజ్ల‌ర్లు సాక్షి మాలిక్ , బ‌జ‌రంగ్ పునియా తో స‌హా 30 మందికి పైగా రెజ్ల‌ర్లు నిర‌స‌న‌కు దిగారు.

నేను ఇవాళ బహిరంగంగా చెప్పాను. రేపు నేను బ‌తికి ఉంటానో లేదో త‌న‌కు తెలియ‌ద‌న్నారు ఫోగ‌ట్. ల‌క్నో నుండి శిబిరాన్ని త‌ర‌లించమ‌ని ప‌లుసార్లు కోరాం. కానీ అందుకు బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ ఒప్పుకోలేద‌న్నారు. ప‌రిస్థితి చేయి దాటి పోతుంద‌ని భావించిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సీరియ‌స్ గా స్పందించింది. ఇదిలా ఉండ‌గా త‌న‌పై ఆరోప‌ణ‌లు అబ‌ద్ద‌మ‌ని చెప్పారు ఎంపీ సింగ్.

Also Read : లైంగిక ఆరోప‌ణ‌లు అబ‌ద్దం – డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్

Leave A Reply

Your Email Id will not be published!