Brij Bhushan Sexual Harrassing : ‘సింగ్’ వేధించడంలో కింగ్
మహిళా రెజ్లర్ల సంచలన ఆరోపణలు
Brij Bhushan Sexual Harrassing : నిత్యం భరతమాత గురించి గొప్పగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ఆయన. ప్రస్తుతం భారత రెజ్లర్ల సంఘం (డబ్ల్యూఎఫ్ఐ) కు అధ్యక్షుడిగా ఉన్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ఆయన ఉన్నంత వరకు తమ ప్రాణాలకు భద్రత లేదని, నిత్యం లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ 30 మంది మహిళా రెజ్లర్లు రోడ్డుపైకి వచ్చారు.
ఆందోళన చేయడంతో దేశ వ్యాప్తంగా ఎవరీ సింగ్ అనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళలకు భద్రత లేకుండా పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే జీవిత ఖైదుకు గురైన సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను విడుదల చేసిన ఘనత బీజేపీ సర్కార్ కే ఉంది.
విచిత్రం ఏమిటంటే డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సింగ్ కు స్వంతంగా లక్నోలో ఇల్లు ఉంది. తన గృహంలోనే రెజ్లర్లకు శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తుండడం విశేషం. రెజ్లింగ్ లో విజేతగా నిలిచిన ఫోగట్ సంచలన ఆరోపణలు చేసింది. ఆమెతో పాటు మిగతా రెజ్లర్లు కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.
తమను శారీరకంగా, మానసికంగా వేధింపులకు(Brij Bhushan Sexual Harrassing) గురి చేస్తున్నాడని బయటకు చెబితే అంతు చూస్తామని హెచ్చరిస్తున్నాడని వాపోయారు. దీంతో కేంద్ర మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. సింగ్ కు 72 గంటల సమయం ఇచ్చింది. వివరణ కోరింది. ఈ మొత్తం వ్యవహారం ప్రధాన మంత్రి దాకా వెళ్లింది. ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం కావడంతో నెట్టింట్లో చర్చకు దారి తీసేలా చేసింది.
గతంలో ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చాలా మంది అమ్మాయిలు ఆరోపణలు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. గత్యంతరం లేక తాము బయటకు వచ్చామని ఆవేదన చెందారు మహిళా రెజ్లర్లు. న్యూఢిల్లీలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ , సాక్షి మాలిక్ తో పాటు 30 మంది మహిళా రెజ్లర్లు ఆందోళనకు దిగారు.
సింగ్ ను తప్పించేంత వరకు తాము నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రధానికి, క్రీడా శాఖ మంత్రికి లేఖలు రాశామని చెప్పారు రెజ్లర్లు. ఇవాళ నేను మాట్లాడుతున్నాను రేపు ఉంటానో ఉండనోనని వాపోయింది ఫోగట్. ప్రస్తుతం ఈ బీజేపీ సింగ్ వేధించడంలో కింగ్ గా మారారని ఆరోపణలు ఉన్నాయి. మరి ప్రధాని స్పందిస్తారా..అనురాగ్ ఠాకూర్ మౌనంగా ఉంటారా వేచి చూడాలి.
Also Read : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కామాంధుడు