Brij Bhushan Sharan Singh : రెజ్లర్ల నిరసన వెనుక కుట్ర
డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్
Brij Bhushan Sharan Singh : తనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న మహిళా రెజ్లర్లపై మండి పడ్డారు మరోసారి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh). ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వారు కేవలం తనను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని, తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఈ నిరసనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు .
తాను నిర్దోషినని ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. సుప్రీంకోర్టు పట్ల తనకు నమ్మకం ఉందన్నారు. తాను ఎంపీగా ఏడుసార్లు గెలిచానని , తనపై ఎవరూ ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. ఒకే కుటుంబానికి చెందిన మహిళా మల్ల యోధులు తనను లక్ష్యంగా చేసుకుని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
90 శాతం మంది అథ్లెట్లు , వారి సంరక్షకులు రెజ్లింగ్ సమాఖ్యను విశ్వసిస్తున్నారని చెప్పారు. కాగా తనపై ఫిర్యాదు చేసిన మహిళలంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వారు ఉన్నారని మండిపడ్డారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. అదే అఖాడా అని పేర్కొన్నారు. వాళ్లంతా మహాదేవ్ రెజ్లింగ్ అకాడమీకి చెందిన వారని ఆరోపించారు. దీపేందర్ సింగ్ హూడా ఆ అఖాడాకు పోషకుడిగా ఉన్నారని మండిపడ్డారు.
Also Read : సంఘ్ పరివార్ పై విజయన్ కన్నెర్ర