Brinda Thounaojam : దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది. అంతటా కనిపిస్తోంది కూడా. ఎవరీ బృందా తోవునా వోజామ్(Brinda Thounaojam) అనుకుంటున్నారా. ఒక రకంగా చెప్పాలంటే ధైర్యానికి, తెగువకు, నీతికి, నిజాయితీకి దర్పణం.
ఇంకో రకంగా పిలవాలంటే శివంగి అనొచ్చు. ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ఈసారి మణిపూర్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయిన్లందరూ ఒకే ఒక్క నియోజకవర్గంపై దృష్టి సారించారు.
కాషాయ దళంలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం ఇక్కడే పర్యటించడం ఆసక్తిని రేపుతోంది. ఎక్కడ చూసినా అమిత్ షా కంటే బృందా తోవునా వోజామ్ గురించే ప్రచారం కొనసాగుతుండడం విశేషం.
మణిపూర్ లో పవర్ లోకి రావాలని విపరీతంగా ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇందుకు తగ్గట్టు ప్రచారంతో హోరెత్తిస్తోంది. అదే సమయంలో ఐపీఎస్ ఆఫీసర్ గా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులెత్తించిన ఈ శివంగి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పైకి చెప్పక పోయినా అమిత్ షా ఇక్కడ ఆమెపై బరిలోకి దిగిన అభ్యర్థిని గెలిపించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అంటే ఆమెకు ఉన్న పవర్ ఏమిటో, జనం పట్ల ఉన్న ఆదరణ ఏపాటిదో గుర్తించవచ్చు
తనను ఓడించేందుకు ఇంత పెద్ద ఎత్తున సైన్యం వస్తుందంటే మేలేగా అని బృందా తోవునా వోజామ్(Brinda Thounaojam) అంటోంది. ప్రస్తుతం బృందా జేడీయూ తరపున పోటీ చేస్తున్నారు. ఈ సూపర్ కాప్ విజయం సాధిస్తుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
Also Read : భద్రతా మండలి లో భారత్ ఓటింగ్ కు దూరం