BRS to Congress Jumpings: తెలంగాణాలో జోరందుకుంటున్న రాజకీయ వలసలు !
తెలంగాణాలో జోరందుకుంటున్న రాజకీయ వలసలు !
BRS to Congress Jumpings : అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండు నెలలు తిరగకముందే తెలంగాణాలో రాజకీయ వలసలు జోరందుకున్నాయి. మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో విజయఢంకా మ్రోగించేందుకు కాంగ్రెస్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసారు. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు…. కేసీఆర్ కు ఝలక్ ఇచ్చి… కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధమౌతున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్లో కీలక నేతలుగా చెలామణి అయిన వారుసైతం… ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవడం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి… కాంగ్రెస్లో చేరగా.. కండువాలు మార్చడానికి ఇప్పుడు మరికొందరు నేతలు ముహూర్తాలు పెట్టుకున్నారు. దీనితో అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి.
BRS to Congress Jumpings Viral
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత హైదరాబాద్ నగర మొదటి మేయర్ గా పని చేసిన బొంతు రామ్మోహన్… బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన… శుక్రవారం నాడు అంటే ఫిబ్రవరి 16వ తేదీన కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం పెట్టుకున్నారు. జీహెచ్ఎంసీ ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కూడా కాంగ్రెస్ లో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వీరితో పాటు… మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ అనితా రెడ్డి, మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఫిక్స్ అయ్యారు. గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
Also Read : Vyricherla Kishore Chandra Deo: మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ టీడీపీకు రాజీనామా !