BRS Leaders Tension : హైదరాబాద్ – రాష్ట్రంలో పదేళ్లుగా రాచరిక పాలన సాగిస్తూ ప్రజలను రాచి రంపాన పెట్టిన బీఆర్ఎస్(BRS) పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలలో గుబులు రేగుతోందా. అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే దొర కేసీఆర్ హయాంలో తన వెలమ కుల సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ సామాన్యులను బానిసల కంటే ఎక్కువగా చూసిన వైనం చివరకు పాలనకు దూరమయ్యేలా చేసింది.
BRS Leaders Tension Viral
జనం ఓటు అనే ఆయుధంతో బండ కేసి కొట్టారు. అంతులేని అవినీతి, అక్రమాలు లెక్కలేని రీతిలో చోటు చేసుకున్నాయి. ఇప్పటికే తాము సంపాదించిన ఆస్తులను కాపాడు కునేందుకు గాను గులాబీ పార్టీ గుర్తుతో గెలుపొందిన ఎమ్మెల్యేలు జంప్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నట్టు సమాచారం.
ఇక తనను ఓటుకు నోటు కేసులో ఇరికించేందుకు ప్రధాన కారకుడు కేసీఆర్ అంటూ ఇప్పటికే ప్రకటిస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో తాను పవర్ లోకి వచ్చాక దొరను వదల బోనంటూ హెచ్చరించాడు. ఇదే సమయంలో గులాబీ నేతల్లో టెన్షన్ నెలకొంది.
ఇప్పటికే కేసీఆర్ , కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు, కవితకు ఊడిగం చేస్తూ వచ్చిన వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదంటూ ప్రకటించారు. మరో వైపు వీరికి నిన్నటి దాకా మద్దతుగా నిలిచిన పోలీస్ ఆఫీసర్లు, సీనియర్ అధికారులు, ప్రభుత్వ సలహాదారులు, సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు.
Also Read : Revanth Reddy KCR : ‘దొర’కు ఝలక్ ఇచ్చిన ‘రెడ్డి’