BRS MLA Candidate: కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా నివేదిత !
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా నివేదిత !
BRS MLA Candidate: రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే లాస్య నందిత కు సంబంధించిన కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదలకానుంది. తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే మూడో విడత ఎన్నికల్లో భాగంగా కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరు ఖరారైంది. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. బుధవారం పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
BRS MLA Candidate…
కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత… ఫిబ్రవరి 23న హైదరాబాద్ లోని అవుటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనితో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి లోక్ సభ ఎన్నికలతో పాటే ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్వహించనుంది. ఉప ఎన్నికలో పోటీకి లాస్య నందిత సోదరి ముందుకు రావడంతో బీఆర్ఎస్ కూడా ఆమెకే టికెట్టును ఖరారు చేసింది.
Also Read : MP Khagen Murmu: ఎన్నికల ప్రచారంలో యువతికి ముద్దు పెట్టిన ఎంపీ !