Janasena Star Campaigners: స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన జనసేన పార్టీ !

స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన జనసేన పార్టీ !

Janasena Star Campaigners: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఏపీలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఐదేళ్ల సుపరిపాలనలో లబ్డిదారులే తమ స్టార్ క్యాంపెయినర్లు అంటూ అధికార వైసీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా లబ్దిదారులతో ముఖాముఖీ మాట్లాడుతూ వారే స్టార్ క్యాంపెయినర్లు అంటూ పదే పదే ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఐదేళ్ళ విధ్వంస, అవినీతి, సైకో పాలనలో దగాపడ్డ ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత, భవన నిర్మాణ కార్మికులే తమ స్టార్ క్యాంపెయినర్లు అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షులు కాలుకి బలపం కట్టుకుని మరీ రోజుకు రెండు మూడు చోట్ల ఎన్నిలక ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ(Janasena) కూడా ప్రచారాన్ని ప్రారంభించింది. పిఠాపురం, అనకాపల్లిలో వారాహి విజయభేరి యాత్రను నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… తాజాగా పార్టీ ప్రచారానికి సంబంధించిన స్టార్ క్యాంపెనర్లను ఖరారు చేసారు.

Janasena Star Campaigners Update

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బుధవారం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్లను పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు, నృత్య దర్శకుడు జానీ మాస్టర్‌, సినీ నటులు సాగర్‌, పృథ్వీ, హైపర్‌ ఆది, గెటప్‌ శ్రీనులను ప్రచారకర్తలుగా నియమించారు. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్ పోటీ చేస్తున్నారు.

Also Read : BRS MLA Candidate: కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా నివేదిత !

Leave A Reply

Your Email Id will not be published!