MLA Harish Rao : బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అరెస్ట్..మరో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత
గచ్చిబౌలిలోని కౌశిక్ రెడ్డి నివాసానికి ఈరోజు (గురువారం) ఉదయం పోలీసులు చేరుకున్నారు...
Harish Rao : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే హరీష్‌రావు(Harish Rao) వెళ్లారు. ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా తిరిగి కౌశిక్ రెడ్డిపైనే కేసు పెట్టారంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో హరీష్‌రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
MLA Harish Rao Arrest..
గచ్చిబౌలిలోని కౌశిక్ రెడ్డి నివాసానికి ఈరోజు (గురువారం) ఉదయం పోలీసులు చేరుకున్నారు. నిన్న బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డి(Koushik Reddy)పై కేసు నమోదు అయ్యింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి బంజారాహిల్స్ పోలీసులు వెళ్లారు. ఇందులో భాగంగానే కౌశిక్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి హరీష్‌రావు చేరుకున్నారు. అయితే హరీష్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని పోలీస్‌స్టేషన్‌లో ఓ ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని, ఇది సరైందని కాదని మాజీ మంత్రి మండిపడ్డారు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఆయన నివాసానికి చేరుకున్న హరీష్‌రావును కూడా పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. అలాగే కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
కాగా..నిన్న బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని.. ఫిర్యాదును స్వీకరించాలని సీఐను కలిసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సీఐ బయటకు వెళ్తున్న నేపథ్యంలో ఆయన వెంటపడి మరీ ఫిర్యాదు చేశారు. అయితే పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఇందులో భాగంగా పోలీసులు ఆయన నివాసానికి వెళ్లగా.. మరోవైపు హరీష్ రావు కూడా అక్కడకు చేరుకోవడంతో స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి తక్షణం విచారించి దోషులను శిక్షించాలనేది బీఆర్‌ఎస్ మాట. అయితే పోలీసుల వాదన వేరేగా ఉంది. కౌశిక్ రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి గూంఢాగిరి చేశారని, పోలీసుల మీద దౌర్జన్యం చేశారని, సీఐ వెళ్లిపోతుంటే బలవంతంగా అడ్డుకుని, వెంటబడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : French Govt Crisis : 60 ఏళ్ల చరిత్రలో మొదటిసారి 3 నెలలకే పడిపోయిన చరిత్ర